TG Polycet: తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. 

Published : 24 May 2024 16:04 IST

హైదరాబాద్‌: తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. జూన్ 20 నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 22 నుంచి తొలి విడత వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. వారికి జూన్ 30న సీట్ల కేటాయింపు ఉంటుంది. జులై 7 నుంచి రెండో విడత కౌన్సెలింగ్‌.. జులై 9న వెబ్ ఆప్షన్ల ప్రక్రియ జరగనుంది. వీరికి జులై 13న సీట్లను కేటాయించనున్నారు. ఇంటర్నల్ స్లైడింగ్‌ కన్వీనర్ ద్వారా చేపట్టాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. జులై 21 నుంచి ఇంటర్నల్ స్లైడింగ్‌ అవకాశం కల్పించారు. జులై 24లోపు అన్ని సీట్లను కేటాయించి..  జులై 23న స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలను విడుదల చేయనున్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని