TSPSC Group 1 Jobs: గ్రూప్‌-1 పోస్టులు పెంపు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణలో గ్రూప్‌-1 ఉద్యోగాల సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated : 06 Feb 2024 16:54 IST

Group 1 Posts Increased| హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరో 60 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. గతంలో 503 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా.. తాజాగా మరో 60 పోస్టులకు ఆమోదం తెలిపింది. దీంతో మొత్తం పోస్టుల సంఖ్య 563కి చేరింది. వీలైనంత త్వరగా ఈ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ (TSPSC)కి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

గ్రూప్‌-1లో 19 విభాగాలకు చెందిన 503 పోస్టులను ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేయాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకనుగుణంగా ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ ద్వారా అభ్యర్థులను  ఎంపిక చేయాలని టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు చేసింది. గతేడాది జూన్‌ 11న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించగా.. దాదాపు 2.32లక్షల మంది హాజరయ్యారు. పేపర్‌ లీకేజీ, హైకోర్టు ఆదేశాల  నేపథ్యంలో రెండు సార్లు ఈ పరీక్ష రద్దయిన విషయం తెలిసిందే.

కొత్తగా పెంచిన పోస్టుల వివరాలివే..గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని