TS News: ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. వయోపరిమితి పెంపు

పోటీ పరీక్షల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది.

Updated : 12 Feb 2024 19:29 IST

హైదరాబాద్‌: పోటీ పరీక్షల అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఉద్యోగాలకు వయోపరిమితిని మరో రెండేళ్లు పెంచుతూ జీవో జారీ చేసింది. జనరల్ కేటగిరీలో వయో పరిమితిని 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచింది. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత  2015లో వయోపరిమితిని 34 నుంచి 44 ఏళ్లకు పెంచారు. నిరుద్యోగ యువత, టీఎస్‌పీఎస్సీ వినతి మేరకు మరో రెండేళ్లు వయోపరిమితి పెంచినట్లు జీవోలో సీఎస్ శాంతికుమారి పేర్కొన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని