Results: గురుకుల జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల ఫలితాలు వచ్చేశాయ్‌.. ఎంపికైన వారి జాబితా ఇదే..

తెలంగాణలోని సంక్షేమ గురుకులాల్లో జూనియర్‌ లెక్చరర్‌ ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 29 Feb 2024 22:20 IST

హైదరాబాద్‌: సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాలల్లో 1,924 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను గురుకుల నియామక బోర్డు గురువారం విడుదల చేసింది.  డిగ్రీ కళాశాలల్లో 793 అధ్యాపకుల ఉద్యోగ రాత పరీక్ష ఫలితాలను నిన్న విడుదల చేసిన అధికారులు.. తాజాగా జేఎల్‌ పోస్టులకు ఎంపికైన వారి ప్రాథమిక జాబితాలను సబ్జెక్టుల వారీగా వెబ్‌సైట్‌ https://treirb.cgg.gov.in/homeలో అందుబాటులో ఉంచారు. జేఎల్‌ రాత పరీక్షలు గతేడాది ఆగస్టు 3 నుంచి 23వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. దివ్యాంగుల కేటగిరీ ఫలితాలు త్వరలోనే ప్రకటించనున్నారు. పోస్టులకు ఎంపికైన వారి (సబ్జెక్టుల వారీగా) ప్రాథమిక జాబితాలు ఇవే..

జేఎల్‌ (మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ) పోస్టులకు ఎంపికైన వారి జాబితా


జేఎల్‌ (హిస్టరీ, సివిక్స్‌, ఎకనామిక్స్‌, కామర్స్‌) పోస్టులకు ఎంపికైన వారి జాబితా


జేఎల్‌ (తెలుగు, హిందీ, ఉర్దూ) పోస్టులకు ఎంపికైన వారి జాబితా


జేఎల్‌ (ఇంగ్లిష్‌) పోస్టులకు ఎంపికైన వారి జాబితా


జేఎల్‌ (బోటనీ) పోస్టులకు ఎంపికైన వారి జాబితా


జేఎల్‌ (జువాలజీ) పోస్టులకు ఎంపికైన వారి జాబితా


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని