TS Inter Exams: ఇంటర్‌ హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారా? డైరెక్ట్‌ లింక్‌ ఇదే..

తెలంగాణ ఇంటర్‌ హాల్‌ టిక్కెట్లు అభ్యర్థులకు నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కింది లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా విద్యార్థులు తమ హాల్‌టిక్కెట్లు పొందొచ్చు.

Updated : 26 Feb 2024 17:19 IST

Telagnana Inter Hall tickets | హైదరాబాద్‌:  తెలంగాణ ఇంటర్‌ వార్షిక పరీక్షలకు హాల్‌ టిక్కెట్లు విడుదలయ్యాయి. ఇటీవల ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్ల లాగిన్‌ ద్వారా డౌన్‌లోడ్‌కు అవకాశం ఇచ్చిన ఇంటర్‌ బోర్డు (TS Inter Board).. తాజాగా విద్యార్థులే తమ హాల్‌టిక్కెట్లను నేరుగా పొందేలా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇంటర్‌ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరగనున్న విషయం తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది 9.8 లక్షల మందికి పైగా విద్యార్థులు TS Inter Exams రాయనున్నారు.

ప్రథమ ఇంటర్‌ విద్యార్థులైతే ఎస్‌ఎస్‌సీ హాల్‌టిక్కెట్‌ నంబర్‌, పుట్టిన తేదీని ఎంటర్‌ చేయడం ద్వారా హాల్‌టిక్కెట్లు పొందొచ్చు.  ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులైతే రోల్‌ నంబర్‌/గత ఏడాది హాల్‌టిక్కెట్‌ నంబర్‌, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌చేయాల్సి ఉంటుంది. బ్రిడ్జి కోర్సు విద్యార్థులైతే ఎస్‌ఎస్‌సీ పరీక్ష నంబర్‌/రోల్‌ నంబర్‌/పుట్టిన తేదీ వివరాలను ఎంటర్‌ చేయడం ద్వారా హాల్‌టిక్కెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రథమ ఇంటర్‌ హాల్‌టిక్కెట్ల కోసం క్లిక్‌ చేయండి


ద్వితీయ ఇంటర్‌ హాల్‌టిక్కెట్ల కోసం క్లిక్‌ చేయండి


బ్రిడ్జి కోర్సు హాల్‌టిక్కెట్ల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని