TS Inter Results: 24న తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. బోర్డు అధికారిక ప్రకటన

TS Inter Results 2024| తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు ఇంటర్‌ బోర్డు ప్రకటించింది.

Updated : 22 Apr 2024 17:41 IST

హైదరాబాద్‌ : తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షల ఫలితాలకు (TS Inter Results 2024) సంబంధించి ఇంటర్‌ బోర్డు కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. ఏప్రిల్‌ 24న (బుధవారం) ఉదయం 11 గంటలకు ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ ఫలితాలు ఒకేసారి విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఫలితాలను ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేస్తారని పేర్కొంది. ఈ ఫలితాలను results.eenadu.netలో చెక్‌ చేసుకోవచ్చు.

ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ప్రథమ, ద్వితీయ ఇంటర్‌ పరీక్షలను 9,80,978 మంది విద్యార్థులు రాశారు. మార్చి 10 నుంచి మూల్యాంకనం ప్రారంభించిన అధికారులు.. ఏప్రిల్‌ 10తో పూర్తి చేసిన అధికారులు ఫలితాల విడుదలకు రంగం సిద్ధం చేశారు. మరోవైపు, పదోతరగతి ఫలితాలను ఈనెల 30 లేదా మే 1వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 

ప్రథమ సంవత్సర ఫలితాలు ద్వితీయ సంవత్సర ఫలితాలు
ప్రథమ సంవత్సరం (ఒకేషనల్‌) ద్వితీయ సంవత్సరం (ఒకేషనల్‌)

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని