TS Inter Results: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు.. బాలికలదే పైచేయి

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు (TS Inter Results) విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు.

Updated : 24 Apr 2024 19:25 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు (TS Inter Results) విడుదలయ్యాయి. నాంపల్లిలోని ఇంటర్‌ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేశారు. మొత్తం 9.81లక్షల మంది ఈ పరీక్షలకు హాజరైనట్లు ఆయన తెలిపారు. ప్రథమ సంవత్సరంలో 60.01శాతం, ద్వితీయ సంవత్సరంలో 64.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఫస్టియర్‌లో 2.87లక్షల మంది, సెకండియర్‌లో 3.22లక్షల మంది విద్యార్థులు పాసయ్యారు.

ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో 68.35 శాతం బాలికలు, 51.5 శాతం బాలురు ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 72.53 శాతం బాలికలు, 56.1 శాతం బాలురు పాసయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో రంగారెడ్డి జిల్లా 71.07 శాతంతో ప్రథమ స్థానంలో.. మేడ్చల్‌ ద్వితీయ స్థానంలో నిలిచాయి. సెకండియర్‌లో ములుగు 81 శాతంతో మొదటి స్థానంలో.. మేడ్చల్‌ ద్వితీయ స్థానం దక్కించుకున్నాయి. బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో మార్కు షీట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

ప్రథమ సంవత్సర ఫలితాలు ద్వితీయ సంవత్సర ఫలితాలు
ప్రథమ సంవత్సరం (ఒకేషనల్‌) ద్వితీయ సంవత్సరం (ఒకేషనల్‌)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని