TS LAWCET 2024: టీఎస్‌ లాసెట్ దరఖాస్తుల గడువు పొడిగింపు.. పరీక్ష ఎప్పుడంటే?

తెలంగాణలో లాసెట్‌ పరీక్షకు దరఖాస్తుల గడువు పొడిగించారు.

Updated : 15 Apr 2024 19:37 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని న్యాయ కళాశాలల్లో ఎల్‌ఎల్‌బీ(LLB), ఎల్‌ఎల్‌ఎం(LLM) కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్‌(LAW CET), పీజీ ఎల్‌ సెట్‌(PG LCET) పరీక్షలకు దరఖాస్తుల గడువు పొడిగించారు. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 15తో అప్లికేషన్ల గడువు ముగియగా.. మరో పది రోజుల పాటు పొడిగించారు. దీంతో ఎలాంటి ఆలస్యరుసుం లేకుండా అభ్యర్థులు ఏప్రిల్‌ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు సాధ్యమైనంత త్వరగా దరఖాస్తులు చేసుకోవాలని లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ బి.విజయలక్ష్మి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

రైల్వేలో 4,660 పోలీస్‌ ఉద్యోగాలు.. దరఖాస్తులు మొదలయ్యాయ్‌..

మూడు, ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ కోర్సులు, రెండేళ్ల ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో చేరేందుకు జూన్‌ 3న ప్రవేశపరీక్ష జరగనుంది.  లాసెట్‌కు దరఖాస్తు రుసుం రూ.900 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600); పీజీఎల్‌ సెట్‌కు రూ.1,100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.900) చొప్పున అభ్యర్థులు చెల్లించాల్సి ఉంటుంది.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని