TS Polycet: తెలంగాణ పాలిసెట్‌ వాయిదా

తెలంగాణలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (పాలిసెట్‌) వాయిదా పడింది. 

Updated : 20 Mar 2024 17:21 IST

TS Polycet 2024| హైదరాబాద్‌: తెలంగాణలో పాలిటెక్నిక్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్ (పాలిసెట్‌) వాయిదా పడింది. పార్లమెంట్‌ ఎన్నికల నేపథ్యంలో పరీక్షను విద్యాశాఖ వాయిదా వేసింది. మే 17న పాలిసెట్‌ జరగాల్సి ఉండగా.. మే 24న నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు గత నెలలో పాలిసెట్‌ నోటిఫికేషన్‌ వెలువడిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్‌ 22 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, వెటర్నరీ, ఫిషరీస్‌) సీట్లను పాలిసెట్‌లో సాధించిన ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. రూ.100 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 24వరకు, రూ.300 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 26వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని