తెలంగాణ పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు.. ర్యాంకింగ్స్ జాబితా విడుదల

TS polytechnic lecturer GRL list: తెలంగాణ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులకు మెరిట్‌ ఆధారంగా జనరల్ ర్యాంకింగ్స్ జాబితాను విడుదల చేశారు.

Updated : 20 Apr 2024 11:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో లెక్చరర్‌ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్‌ ర్యాంకుల జాబితాను (జీఆర్‌ఎల్‌) టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. ఈ జాబితాను కమిషన్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు వెల్లడించింది. (TS polytechnic lecturer GRL list)

మొత్తం 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబరులో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 4 నుంచి 8వ తేదీ వరకు సబ్జెక్టుల వారిగా నిర్వహించిన పాలిటెక్నికల్ లెక్చరర్ పరీక్షలు రాసిన అభ్యర్థుల మెరిట్ ఆధారంగా జనరల్ ర్యాంకింగ్స్ విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పటినుంచి అనే సమాచారం తర్వాత ప్రకటిస్తామని టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ర్యాంకుల జాబితాలో కోసం.. https://www.tspsc.gov.in/GRLPL13570AS ఈ లింక్‌పై క్లిక్ చేయండి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని