TS SSC Results date: తెలంగాణ ‘పది’ ఫలితాలు ఎప్పుడంటే..?

Telangana SSC Results date | తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలకు సిద్ధమయ్యాయి. ఈనెల 30న ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Updated : 24 Apr 2024 19:21 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంటర్‌ పరీక్షల ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు.. పదో తరగతి ఫలితాల (Telangana SSC Results 2024) విడుదలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈనెల 30న ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ కార్యాలయంలో TS SSC Resultsను ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు పరీక్షలు జరగ్గా.. మూల్యాంకనం పూర్తి చేసిన అధికారులు..  ఫలితాలను సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. ఫలితాలను results.eenadu.netలో చెక్‌ చేసుకోవచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని