TS TET Applications: టెట్‌కు 2.83లక్షల దరఖాస్తులు.. జిల్లాల వారీగా వివరాలు ఇలా..

తెలంగాణ టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలు జిల్లాల వారీగా విడుదలయ్యాయి.

Published : 21 Apr 2024 23:06 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌)-2024కు దరఖాస్తుల గడువు శనివారంతో ముగిసిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష కోసం మొత్తంగా 2,83,441 మంది దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. పేపర్‌-1కి 99,210 మంది,  పేపర్‌-2కి 1,84,231 మంది అప్లై చేశారు.  పేపర్‌ -2లో మ్యాథమెటిక్స్‌, సైన్స్‌కు 99,974 మంది అప్లై చేసుకోగా.. సోషల్‌ స్టడీస్‌కు 86,454 దరఖాస్తులు వచ్చాయి.పేపర్‌- 1కు ఆదిలాబాద్‌ జిల్లా నుంచి అత్యధికంగా 7,504 దరఖాస్తులు రాగా.. పేపర్‌- 2కు సంబంధించి నల్గొండ జిల్లా నుంచి అత్యధికంగా 9,162మంది దరఖాస్తులు వచ్చాయి. మరోవైపు, కంప్యూటర్‌ ఆధారిత విధానంలో నిర్వహించే టెట్‌ పరీక్షలను మే 20 నుంచి జూన్‌ 3 వరకు నిర్వహించనున్నారు. ఫలితాలు జూన్‌ 12న విడుదల చేస్తారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని