TSGENCO: తెలంగాణ జెన్‌కో ఏఈ, కెమిస్ట్‌ ఉద్యోగ పరీక్ష వాయిదా

జెన్‌కోలో అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ), కెమిస్ట్‌ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది.

Published : 28 Mar 2024 17:58 IST

హైదరాబాద్‌: తెలంగాణ స్టేట్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (జెన్‌కో)లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌(ఏఈ), కెమిస్ట్‌ ఉద్యోగాల నియామక రాత పరీక్ష వాయిదా పడింది. ఎన్నికల కోడ్‌ కారణంగా ఈ నెల 31న జరగాల్సిన పరీక్షలను జెన్‌కో వాయిదా వేసింది. ఎన్నికల కోడ్‌ ముగిసిన తర్వాత పరీక్షల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. జెన్‌కోలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్‌ పోస్టులను ప్రత్యక్ష, రెగ్యులర్ నియామకాల పద్ధతిలో భర్తీ చేసేందుకు సంస్థ యాజమాన్యం ప్రకటన జారీచేసిన విషయం తెలిసిందే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని