TSPSC: గ్రూప్‌-1 దరఖాస్తుల గడువు పొడిగింపు

గ్రూప్‌-1 దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) పొడిగించింది.

Updated : 14 Mar 2024 20:25 IST

TSPSC Group 1 Applications| హైదరాబాద్‌: గ్రూప్‌-1 ఉద్యోగ నియామక పరీక్షకు దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) పొడిగించింది. అభ్యర్థులకు మరో రెండు రోజులపాటు అవకాశం కల్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత నెల 19న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. బుధవారం వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు అందినట్టు టీఎస్‌పీఎస్సీ తెలిపింది. షెడ్యూల్‌ ప్రకారం గురువారం సాయంత్రం 5గంటలకు గడువు ముగియడంతో.. మరో రెండ్రోజుల పాటు పొడిగిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో ఇంకా దరఖాస్తు చేసుకోని వారు ఆన్‌లైన్‌ https://www.tspsc.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21నుంచి నిర్వహించనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు