TSPSC: గ్రూప్‌ -1 నోటిఫికేషన్‌ రద్దు.. టీఎస్‌పీఎస్సీ నిర్ణయం

తెలంగాణలో గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.

Updated : 19 Feb 2024 19:06 IST

TSPSC Group 1 Notification| హైదరాబాద్‌:  తెలంగాణలో గ్రూప్‌-1 ఉద్యోగాల భర్తీ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. ఈ మేరకు సోమవారం వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. 2022 ఏప్రిల్‌లో 503 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పలు సమస్యలపై కమిషన్‌ చర్చించిందని.. అన్ని పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకున్నాకే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు TSPSC కార్యదర్శి డా. నవీన్‌ నికోలస్‌ పేర్కొన్నారు.

అయితే, పేపర్‌ లీకేజీ కారణంగా ఒకసారి, నిబంధనలు సరిగా పాటించలేదని ఇంకోసారి గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష రద్దు చేసిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఇటీవల మరో 60 గ్రూప్‌ -1 పోస్టులకు కొత్త ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో గతంలో ఇచ్చిన నోటిఫికేషన్‌ను పూర్తిగా రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. మొత్తం 563 గ్రూప్‌ 1 పోస్టులకు త్వరలోనే కొత్త నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని