TSPSC: పలు ఉద్యోగ పరీక్షల ఫలితాలు విడుదల

పలు ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) విడుదల చేసింది.

Updated : 21 Feb 2024 22:08 IST

TSPSC Exam Results | హైదరాబాద్‌: పలు ఉద్యోగ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) విడుదల చేసింది. వీటిలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌, అర్బన్‌ డెవలప్‌మెంట్‌, జూనియర్‌, సీనియర్‌ అకౌంటెంట్‌ పోస్టులకు సంబంధించిన ఫలితాలు ఉన్నాయి. మొత్తం 12,186 మంది అభ్యర్థుల ర్యాంకులను ప్రకటించగా.. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన వారి జాబితాను త్వరలో విడుదల చేయనున్నట్లు TSPSC తెలిపింది. ఈ ఉద్యోగాలకు గతేడాది ఆగస్టులో పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని