TSPSC: ఆరు ఉద్యోగ నోటిఫికేషన్లు.. పరీక్షల ఫలితాలు విడుదల

తెలంగాణలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించిన రాతపరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 

Updated : 17 Feb 2024 00:55 IST

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి ఆరు ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడులయ్యాయి. ఈ మేరకు జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాల (జీఆర్‌ఎల్‌)ను టీఎస్‌పీఎస్సీ(TSPSC) శుక్రవారం రాత్రి విడుదల చేసింది. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హార్టికల్చర్‌ అధికారి, లైబ్రేరియన్లు, ఏఎంవీఐ, వ్యవసాయ అధికారి పోస్టుల భర్తీకి 2022లో నోటిఫికేషన్లు ఇవ్వగా, 2023 మే, జూన్‌, జులై నెలల్లో కంప్యూటర్‌ ఆధారిత రాతపరీక్షలు నిర్వహించారు. తాజాగా ఈ పరీక్షల జనరల్‌ ర్యాంకు జాబితాలను టీఎస్‌పీఎస్సీ (TSPSC) వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు కమిషన్‌ కార్యదర్శి వెల్లడించారు. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు 1:2 నిష్పత్తిలో జాబితాలు త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. 

జనరల్‌ ర్యాంకు జాబితా కోసం ఈ లింక్‌పై క్లిక్‌ చేయండి.. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని