UGC NET: యూజీసీ నెట్‌ (జూన్‌) నోటిఫికేషన్‌ విడుదల.. పరీక్ష ఎప్పుడంటే?

యూజీసీ నెట్‌ పరీక్షకు నోటిఫికేషన్‌ వెలువడింది. అర్హులైన అభ్యర్థులు మే 10వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published : 21 Apr 2024 15:26 IST

దిల్లీ: దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే యూజీసీ నెట్ పరీక్షకు నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే పెన్ను, పేపర్‌ (ఓఎంఆర్‌ షీట్‌) ఆధారిత పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ మొదలైనట్లు యూజీసీ (UGC) వెల్లడించింది. ఈ పరీక్ష దేశ వ్యాప్తంగా జూన్‌ 16న NTA ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. జనరల్‌/అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులు రూ.1150, జనరల్‌-ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ-ఎన్‌సీఎల్‌ అభ్యర్థులు రూ.600, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/థర్డ్‌ జెండర్‌కు రూ.325 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి.

నోటిఫికేషన్‌లో కీలక అంశాలివే.. 

  • మే 10 రాత్రి 11.50గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. 
  • అప్లికేషన్‌ రుసుంను మే 11 నుంచి 12 రాత్రి 11.50గంటల వరకు చెల్లించవచ్చు. 
  • దరఖాస్తుల్లో ఏవైనా పొరపాట్లు ఉంటే మే 13 నుంచి 15వరకు సరిచేసుకోవచ్చు. 
  • అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. ఓబీసీ- ఎన్‌సీఎల్‌/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ థర్డ్ జెండర్ కేటగిరీ అభ్యర్థులకు 50% మార్కులు అవసరం.
  • వయో పరిమితి: జేఆర్‌ఎఫ్‌కు 01.06.2024 నాటికి 30 ఏళ్లు మించరాదు. అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు గరిష్ఠ వయో పరిమితి ఏమీ లేదు.
  • పరీక్ష ఇలా: పరీక్ష రెండు పేపర్లుగా ఉంటుంది. ఆబ్జెక్టివ్‌, మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. 180 నిమిషాల పాటు జరుగుతుంది. పేపర్లు ఇంగ్లిష్‌, హిందీలో మాత్రమే ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కులు లేవు.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని