UPSC Civils Results: నా విజయానికి స్నేహితులే కారణం..: సివిల్స్ విజేత నౌషీన్‌

సివిల్స్‌లో తాను తొమ్మిదో ర్యాంకు సాధించడానికి కారణం తన ఫ్రెండ్స్‌, కోచింగ్‌ అకాడమీ అని నౌషీన్‌ అన్నారు.

Published : 16 Apr 2024 22:27 IST

గోరఖ్‌పుర్‌: యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్‌ ఫలితాల్లో యూపీలోని గోరఖ్‌పుర్‌కు చెందిన నౌషీన్‌ తొమ్మిదో ర్యాంకు సాధించారు. మూడో ప్రయత్నంలో ఆమె కల సాకారం కావడంతో స్థానికంగా పండుగ వాతావరణం నెలకొంది. దిల్లీలోని జామియా మిల్లియా ఇస్లామియా రెసిడెన్షియల్‌ కోచింగ్ అకాడమీ నుంచి సివిల్స్‌కు ఎంపికైన 31మందిలో ఒకరైన నౌషీన్‌..  తన విజయానికి స్నేహితులు, కోచింగ్‌ అకాడమీయే కారణమన్నారు. తన కలను సాకారం చేసుకోవడంలో స్నేహితులు ఎంతగానో సహకరించారని చెప్పారు. గోరఖ్‌పుర్‌లో పాఠశాల విద్యనభ్యసించిన ఆమె.. దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్‌ చేశారు.

‘‘నా కల సాకారం కావడంలో క్రెడిట్‌ అంతా జామియా రెసిడెన్షియల్‌ కోచింగ్ అకాడమీకే చెందుతుంది. రెండు ప్రయత్నాల తర్వాత 2021 నవంబర్‌ నుంచి నేను అక్కడే శిక్షణ పొందాను.   నా విజయంలో ఇన్‌స్టిట్యూట్‌దే కీలక పాత్ర. ఇప్పటికే సెలెక్ట్‌ అయినవారు అనేకమంది నాకు సహకారం అందించారు. నా స్నేహితులు నోట్సు ఇవ్వడం, గైడెన్స్‌.. ఇలా ప్రతి విషయంలోనూ సహకరించడం వల్లే ఈ విజయం సాధ్యమైంది’’ అని వివరించారు. 

నౌషీన్‌ విజయంతో ఆమె తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు. ఆమెకు లడ్డూలు తినిపించి ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తండ్రి మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు ఇతర అమ్మాయిలు మొదటి, రెండు, మూడు, తొమ్మిది ర్యాంకులు సాధించారని పత్రికల్లో ఇంటర్వ్యూలు చదివేవాళ్లం. కానీ ఇప్పుడు మా కుమార్తె తొమ్మిదో ర్యాంకు సాధించింది’’ అని ఆనందంతో చెప్పారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని