UPSC IFS final Result: ఐఎఫ్‌ఎస్‌ తుది ఫలితాలు వచ్చేశాయ్‌.. టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

Eenadu icon
By Features Desk Updated : 08 May 2024 18:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

దిల్లీ: యూపీఎస్సీ నిర్వహించిన ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ మెయిన్‌ పరీక్ష తుది ఫలితాలు (UPSC IFS Main 2023 final Result) విడుదలయ్యాయి. గతేడాది నవంబర్‌ 26 నుంచి డిసెంబర్‌ 3 వరకు మెయిన్‌ పరీక్ష నిర్వహించగా.. ఏప్రిల్‌ 22 నుంచి మే 1 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఫలితాలను UPSC బుధవారం విడుదల చేసింది. అభ్యర్థులు సాధించిన మెరిట్‌ ఆధారంగా ర్యాంకర్ల జాబితాను విడుదల చేసింది. వీరిలో మొత్తం 147 మందిని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాలకు రికమెండ్‌ చేసింది. జనరల్‌ కేటగిరీలో 43 మందిని ఎంపిక చేయగా.. ఈడబ్ల్యూఎస్‌ 20, ఓబీసీ 51, ఎస్సీ 22, ఎస్టీ 11 మంది చొప్పున ఎంపికయ్యారు. 

యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్‌ విడుదల.. ‘సివిల్స్‌’ పరీక్షలు ఎప్పుడంటే?

టాప్ 10 ర్యాంకర్లు వీరే.. 

  • రిత్విక పాండే
  • కాలె ప్రతీక్ష నానా సాహెబ్‌
  • స్వస్తిక్‌ యదువంశీ
  • పండిట్‌ షిరిన్‌ సంజయ్‌
  • విద్యాన్షు శేఖర్‌ ఝా
  • రోహన్‌ తివారి
  • కావ్య వైఎస్‌
  • ఆదర్శ్‌ జి
  • పంకజ్‌ చౌధరి
  • శశాంక్‌ భరద్వాజ్‌

Published : 08 May 2024 18:38 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని