యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్‌ విడుదల.. ‘సివిల్స్‌’ పరీక్షలు ఎప్పుడంటే?

వచ్చే ఏడాదిలో నిర్వహించే పలు ఉద్యోగ నియామక పరీక్షలకు సంబంధించిన తేదీలతో యూపీఎస్సీ క్యాలెండర్‌ను విడుదల చేసింది. UPSC 2025 Calendar

Published : 25 Apr 2024 19:34 IST

UPSC 2025 Calendar| దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) వచ్చే ఏడాది నిర్వహించే పరీక్షల క్యాలెండర్‌ను ప్రకటించింది. 2025లో చేపట్టే ఉద్యోగ నియామక పోటీ పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్‌ను విడుదల చేసింది. దీంట్లో 2025 జనవరి నుంచి 2025 డిసెంబర్‌ వరకు నిర్వహించే పరీక్షల తేదీలను పేర్కొంది. దీనిప్రకారం.. 2025 జనవరి 22 నుంచి ఫిబ్రవరి 11 వరకు సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తులు స్వీకరించి మే 25న పరీక్ష నిర్వహించనుంది. అలాగే, ఆగస్టు 22 నుంచి ఐదు రోజుల పాటు యూపీఎస్సీ మెయిన్స్‌ పరీక్షలు జరగనున్నాయి. 

డిగ్రీతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. సీఏపీఎఫ్‌లో 506 పోస్టులకు UPSC నోటిఫికేషన్‌

వీటితో పాటు సీబీఐ (డీఎస్పీ), ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ (ప్రిలిమినరీ), సీఐఎస్‌ఎఫ్‌, ఎన్‌డీఏ, ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ, మెయిన్‌, సీడీఎస్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌, కంబైన్డ్‌ మెడికల్‌ సర్వీసెస్‌ తదితర ఉద్యోగ నియామక పరీక్షల షెడ్యూల్‌ను యూపీఎస్సీ ఈ చార్ట్‌లో పేర్కొంది. ఆయా పోస్టులకు నోటిఫికేషన్‌, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను ఈ క్యాలెండర్‌లో పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చని తెలిపింది. యూపీఎస్సీ పరీక్షల క్యాలెండర్‌ను ఈ కింది డాక్యుమెంట్‌లో చూడొచ్చు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని