మెనోపాజ్‌ చలి

మహిళలకు 50 ఏళ్లు దాటిన తర్వాత రుతుక్రమం నిలిచిపోతుంటుంది. ఇలాంటి సమయంలో చాలామంది వేడి ఆవిర్లు (హాట్‌ ఫ్లాషెస్‌), రాత్రిపూట చెమటలు...

Published : 01 Nov 2016 01:19 IST

మెనోపాజ్‌ చలి

హిళలకు 50 ఏళ్లు దాటిన తర్వాత రుతుక్రమం నిలిచిపోతుంటుంది. ఇలాంటి సమయంలో చాలామంది వేడి ఆవిర్లు (హాట్‌ ఫ్లాషెస్‌), రాత్రిపూట చెమటలు, నిద్ర సరిగా పట్టకపోవటం వంటి లక్షణాలతో సతమతమవుతుంటారు. కొందరికి రాత్రిపూట ఉన్నట్టుండి చలి, వణుకు (కోల్డ్‌ ఫ్లాషెస్‌) కూడా వస్తుంటాయి. దీనికి కారణం శరీరంలో హార్మోన్ల స్థాయులు అస్తవ్యస్తం కావటమే. సాధారణంగా మన జీవగడియారం రాత్రిపూట శరీరాన్ని కాస్త చల్లగా ఉండేలా చూస్తుంది. అయితే హార్మోన్లు అస్తవ్యస్తమైనప్పుడు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే మన మెదడులోని భాగం స్పందించి.. సాధారణ ఉష్ణోగ్రత స్థాయిని పెంచేందుకు ప్రయత్నిస్తుంది. ఈ ఉష్ణోగ్రత స్థాయికి శరీరం కుదురుకునే ప్రయత్నంలో భాగంగా చలి, వణుకు వంటివి తలెత్తుతాయి. ఇవి కొద్దిసేపట్లో సర్దుకుంటాయి. కానీ కొందరిలో ఇవి తరచుగా వస్తూ ఇబ్బంది పెడుతుంటాయి. ఇలాంటివారు పడుకునే ముందు పాదాలకు సాక్స్‌ ధరించటం మంచిది. అలాగే పడుకోవటానికి ముందు కాఫీ, టీ, మద్యం జోలికి వెళ్లకూడదు. క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయాలి. మరీ ఇబ్బంది పెడుతుంటే డాక్టర్‌ను సంప్రదించాలి. అవసరమైతే డాక్టర్లు హార్మోన్‌ మాత్రలు ఇవ్వటం వంటివి చేస్తారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని