Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 27 Apr 2024 09:01 IST

1. ‘ఇసుఖ’శాంతులన్నీ వైకాపా మేతలకే

తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చారు. తద్వారా ఇళ్ల నిర్మాణానికి పేదలకు పెద్దగా సమస్యలు ఎదురుకాలేదు. వైకాపా అధికారంలోకి వచ్చాక కొన్నినెలలపాటు ఆంధ్రప్రదేశ్‌ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) ఆధ్వర్యంలో ఇసుక తవ్వకాలు, విక్రయాలు సాగాయి. అనంతరం తెర ముందు జై ప్రకాష్‌ పవర్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌ సంస్థను ఉంచి.. వెనుక ప్రభుత్వ పెద్దలు చక్రం తిప్పడం ప్రారంభించారు. పూర్తి కథనం

2. ప్రచారానికి వడదెబ్బ

పార్లమెంట్‌ ఎన్నికల గడువు ముంచుకొస్తోంది.. ప్రస్తుతం అభ్యర్థులు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఇక అన్ని పార్టీలు ప్రచారం కోసం రంగంలోకి దిగనున్నాయి. మరోవైపు ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతుండటంతో ఆ ప్రభావం ఎన్నికల ప్రచారంపై పడుతోంది. దీంతో సాయంత్రం వేళ నేతలు కార్నర్‌ సమావేశాలకే పరిమితమవుతున్నారు. పూర్తి కథనం

3. ఎంపీ బాలశౌరిపై.. పేర్ని కుతంత్రాలు!

జనసేన, తెదేపా, భాజపా కూటమి అభ్యర్థిగా.. మచిలీపట్నం లోక్‌సభ బరిలో దిగిన.. ఎంపీ బాలశౌరికి జనంలో వస్తున్న ఆదరణను చూసి.. వైకాపా జిల్లా అధ్యక్షుడు పేర్ని నానికి ఓటమి భయం పట్టుకుంది. బాలశౌరిని నేరుగా ఢీకొట్టలేక.. అడ్డదారుల్లో ఓడించాలని తీవ్రంగా కుతంత్రాలు ఆరంభించారు.పూర్తి కథనం

4. క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్‌ జమానాలో అంతా వ్యాపారమే

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక క్రీడాశాఖను నిర్వీర్యం చేసింది. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైంది. కొత్త మైదానాలు ఏర్పాటు చేయకపోగా ఉన్నవాటికీ మరమ్మతులు చేయించలేదు. మైదానాలు, శిక్షకులు, ఇతర సౌకర్యాలు మెరుగుపరచలేదు. క్రీడా వికాసంపై దృష్టి పెట్టకుండా ఆర్థిక ప్రయోజనాలే ధ్యేయంగా ముందుకెళ్లారు. పూర్తి కథనం

5. ఐదేళ్ల ‘దారి’ద్ర్యం

కర్నూలు జిల్లాలో 1530.817 కి.మీ, నంద్యాలలో 1512.505 కి.మీ. రహదారులు విస్తరించి ఉన్నాయి. రోడ్ల మరమ్మతులకు తెదేపా (2014-19) హయాంలో ఏటా రూ.30- రూ.50 కోట్ల వరకు మంజూరు చేసేవారు. ఆ నిధులతో రహదారుల వెంట ఉన్న ముళ్లపొదలు తొలగించడం.. గుంతలు పూడ్చటం.. సూచికలు ఏర్పాటు చేయడం.. వంతెనలకు మరమ్మతులు చేయడం వంటి పనులు చేసేవారు. జగన్‌ జమానా (2019-24)లో రూ.10-రూ.12 కోట్ల వరకు కేటాయిస్తున్నారు. విడుదల మాత్రం సకాలంలో చేయడం లేదు. పూర్తి కథనం

6. ఎన్నికల వేళ...‘కూపన్ల’ ఎర..!

ప్రజాదరణ కోల్పోయిన అధికార పార్టీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు జనం లేక వెలవెలబోతున్నాయి. దీన్ని అధిగమించేలా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్‌ కూపన్ల, మహిళలకు, నాయకులకు నగదు పేరిట ఎర వేస్తున్నారు. అలా పశ్చిమ నియోజకవర్గంలో ఇటీవల అధికార పార్టీ అభ్యర్థి నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న వారికి ‘కూపన్ల’పై పెట్రోల్‌ పోసిన బంకును జిల్లా అధికారులు శుక్రవారం సీజ్‌ చేశారు.పూర్తి కథనం

7. పెళ్లిళ్లు, శుభకార్యాలకు విరామం

పెళ్లిళ్లు, శుభకార్యాలకు శనివారం నుంచి బ్రేక్‌ పడనుంది. మూఢం వచ్చేసింది. గ్రహాల స్థితి సరిగా లేని సమయాన్ని మూఢంగా జ్యోతిష్యులు చెబుతారు. గురుగ్రహం సూర్యుడికి దగ్గరగా వచ్చినపుడు గురుమౌఢ్యంగా, శుక్రగ్రహం సూర్యగ్రహనికి దగ్గర వచ్చినప్పుడు శుక్ర మౌఢ్యంగా పిలుస్తారు. ఈ కాలాన్ని ఏవైనా పనులు ప్రారంభించడానికి అశుభంగా భావిస్తూ వాయిదా వేస్తుంటారు. పూర్తి కథనం

8. బొగ్గు బాయిల చుట్టూ రాజకీయం

ఈ ఎన్నికల్లో పెద్దపల్లిలో రాజకీయం మొత్తం బొగ్గు బాయిల చుట్టే తిరుగుతోంది. నియోజకవర్గంలో గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో సింగరేణి కార్మికులున్నారు. దీంతో గనుల్లో పని చేసే కార్మికులు, వారి కుటుంబ సభ్యులను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. కార్మికుల ఆదరణ చూరగొనేందుకు అభ్యర్థులు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు.పూర్తి కథనం

9. లోక్‌సభ బరి.. 28 మందికి తొలిసారి..!

శాసనసభ ఎన్నికల ఫలితాలతో రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితులు అన్ని పార్టీలకు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టాయి. లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటుకోవడం మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, భారాస, భాజపాలకు అనివార్యంగా మారింది.  రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో ముక్కోణపు పోటీలకు తెరలేచింది. గెలుపే లక్ష్యంగా పార్టీలు అనుసరించిన వ్యూహాల ఫలితంగా అత్యధికంగా తాజా, మాజీ ప్రజాప్రతినిధులే అభ్యర్థులుగా నిలిచారు.పూర్తి కథనం

10. నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు

ఉమ్మడి జిల్లాలో లోక్‌సభ ఎన్నికల పోరు ఆసక్తికరంగా సాగుతోంది. తండ్రుల రాజకీయ వారసత్వ తీర్థం పుచ్చుకొని ఎన్నికల క్షేత్రంలో పోరాడేందుకు యువ వారసులు సిద్ధమయ్యారు. వరంగల్‌, మహబూబాబాద్‌తో పాటు భూపాలపల్లి జిల్లాలోని ఐదు నియోజకవర్గాలు కలిసి ఉన్న పెద్దపల్లిలోనూ రాజకీయ వారసులు ఎంపీ అభ్యర్థులుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని