ముందస్తు నెలసరికి పాల రక్ష!

కొందరికి కాస్త త్వరగా నెలసరి నిలిచిపోతుంటుంది (మెనోపాజ్‌). దీంతో ఎముకలు గుల్లబారటం, గుండెజబ్బుల వంటి సమస్యల ముప్పు మరింత పెరుగుతుంది. అయితే క్యాల్షియం, విటమిన్‌ డి ఎక్కువగా తీసుకోవటం ద్వారా ఇలా త్వరగా మెనోపాజ్‌ ముంచుకొచ్చే ముప్పును...

Published : 28 Nov 2017 02:10 IST

ముందస్తు నెలసరికి పాల రక్ష!

కొందరికి కాస్త త్వరగా నెలసరి నిలిచిపోతుంటుంది (మెనోపాజ్‌). దీంతో ఎముకలు గుల్లబారటం, గుండెజబ్బుల వంటి సమస్యల ముప్పు మరింత పెరుగుతుంది. అయితే క్యాల్షియం, విటమిన్‌ డి ఎక్కువగా తీసుకోవటం ద్వారా ఇలా త్వరగా మెనోపాజ్‌ ముంచుకొచ్చే ముప్పును తగ్గించుకోవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుర్తించాల్సిన విషయం ఏంటంటే- మాత్రల కన్నా క్యాల్షియం, విటమిన్‌ డి దండిగా గల ఆహారం తీసుకోవటం మూలంగానే ఈ ఫలితం కనబడుతుండటం. ముఖ్యంగా పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులతో ఇంకాస్త ఎక్కువ ప్రయోజనం చేకూరటం. పాలు, పెరుగు, మజ్జిగ వంటి వాటితో లభించే విటమిన్లు, కొవ్వులు, హార్మోన్లు (ప్రొజెస్టిరాన్‌, ఈస్ట్రోజెన్‌ వంటివి) మాత్రల్లో ఉండకపోవటమే దీనికి కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. కాబట్టి ఆహారంలో పాల ఉత్పత్తులను విధిగా చేర్చుకోవటం మంచిదని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎముక పటుత్వం తగ్గకుండానూ చూసుకోవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని