చెవిలో పాట మోత!

టీవీలోనో రేడియోలోనో పాటలో ఓ భాగం వినబడుతుంది. కొన్నిసార్లు ఇది ఆ తర్వాత కూడా లీలగా చాలాసేపు మనసులో మెదులుతూనే ఉంటుంది.

Published : 28 Feb 2017 01:47 IST

చెవిలో పాట మోత!

టీవీలోనో రేడియోలోనో పాటలో ఓ భాగం వినబడుతుంది. కొన్నిసార్లు ఇది ఆ తర్వాత కూడా లీలగా చాలాసేపు మనసులో మెదులుతూనే ఉంటుంది. సుమారు 98% మంది ఎప్పుడో అప్పుడు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నవారేనని నిపుణులు చెబుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతుందనేది కచ్చితంగా తెలియదు గానీ.. దీనికీ ఒత్తిడికీ సంబంధం ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. చేసినపనినే మళ్లీ మళ్లీ చేసేవారిలో, పదే పదే ఒకే తరహా ఆలోచనలు వచ్చే వారిలో ఇలాంటిది ఎక్కువ. దీనికి స్త్రీలు, పురుషులనే తేడా లేదు. అయితే మహిళల్లో కాస్త ఎక్కువసేపు పాట ‘వినబడుతుంటుంది’. నిజానికిది ఇబ్బందేమీ పెట్టదు. కానీ కొందరిలో మాత్రం చికాకుకు దారితీస్తుంది. చేసే పనులపై ఏకాగ్రత కొరవడేలా చేస్తుంటుంది. ఇలాంటి సమయంలో మెదడుకు పని పెట్టే పజిల్స్‌ చేయటమో, నవల చదవటమో మంచిది. బబుల్‌గమ్‌ నములుతున్నా ఫలితం కనబడుతుంది. మనసులో మెదిలే పాటను పూర్తిగా విన్నా కూడా అది చెవిలో ‘మోగటం’ తగ్గుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని