ఏనుగు బొమ్మలోయ్‌....రికార్డు కొట్టేనోయ్‌!!

ఒరిగామి అంటే తెలుసుగా! కాగితంతోనే రకరకాల ఆకారాల్లో బొమ్మలు చేయడం. అలా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కాగితాలతో ఏనుగు బొమ్మలు చేశారు. వాటన్నింటిని ఒక దగ్గరకు చేర్చారు. చూడాలంటే అమెరికా మన్‌హట్టన్‌లోని బ్రోంక్స్‌ జంతుప్రదర్శన శాలకు వెళ్లాల్సిందే.

Published : 23 Nov 2016 01:17 IST

ఏనుగు బొమ్మలోయ్‌....రికార్డు కొట్టేనోయ్‌!!

ఒకటి కాదు రెండు కాదు వేలాది ఏనుగులు... ఒకే దగ్గరికి చేరాయి... రంగు రంగులతో కనువిందు చేస్తున్నాయి... పైగా రికార్డూ కొట్టాయి... ఇంతకీ వీటి ప్రత్యేకత ఏంటి?

రిగామి అంటే తెలుసుగా! కాగితంతోనే రకరకాల ఆకారాల్లో బొమ్మలు చేయడం. అలా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కాగితాలతో ఏనుగు బొమ్మలు చేశారు. వాటన్నింటిని ఒక దగ్గరకు చేర్చారు. చూడాలంటే అమెరికా మన్‌హట్టన్‌లోని బ్రోంక్స్‌ జంతుప్రదర్శన శాలకు వెళ్లాల్సిందే.

* మొత్తం 78,564 బొమ్మ ఏనుగులు ఈ జూలో కనిపిస్తాయి. రంగురంగుల్లో చూడముచ్చటగా ఉన్న ఈ ఏనుగుల్ని చూసి గిన్నిస్‌ రికార్డు వాళ్లు ‘అతి పెద్ద ఒరిగామి ఏనుగుల ప్రదర్శన’గా రికార్డు ఇచ్చేశారు.

* ఈ ప్రదర్శనను ఏదో సరదాకి ఏర్పాటు చేయలేదు. దీని వెనుక ఓ మంచి కారణం ఉంది. దంతాల కోసం రోజుకు 96 ఏనుగుల్ని వేటాడుతున్నారట. దీంతో ఏడాదికి దాదాపు 35 వేల ఏనుగులు చనిపోతున్నాయిట. తగ్గిపోతున్న ఏనుగుల సంఖ్యను పెంచాలనీ, వాటి సంరక్షణా బాధ్యతపై అందరికీ అవగాహన కల్పించాలనీ ఈ ప్రచార కార్యక్రమం నిర్వహించారు.

* దీని కోసం ‘వన్యప్రాణి సంరక్షణ సొసైటీ’ ‘96 ఏనుగుల ప్రచారం’ అనే పేరుతో ఈ ప్రదర్శన జరిపింది.

* రకరకాల పరిమాణాల్లో, ఆకట్టుకునే రంగుల్లో ఉన్న ఈ ఏనుగు బొమ్మల్ని ఎవరు చేశారో తెలుసా? వందలాది స్కూళ్ల విద్యార్థులు, కొంత మంది కళాకారులు. అమెరికాలో 50 రాష్ట్రాలతో పాటు 40 దేశాల నుంచి వీరంతా పాల్గొన్నారు. ఇందులో ఇరాన్‌, ఈజిప్టు, కజికిస్థాన్‌ దేశాల దివ్యాంగుల పాఠశాలల విద్యార్థులూ ఉన్నారు.

* డిసెంబరు నెల చివరి వరకూ సందర్శకుల కోసం ఈ ప్రదర్శన ఉంచుతారు.

* ఇది వరకు 2014లో బ్రిటన్‌లో ఏర్పాటు చేసిన ఒరిగామి ఏనుగుల ప్రదర్శనకు గిన్నిస్‌ రికార్డు ఉండేది. ఈ ప్రదర్శనలో 33,764 ఏనుగు బొమ్మల్ని తయారుచేసిపెట్టారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని