మంచును తవ్వేయ్‌.... చేపను పట్టేయ్‌!

అంతా ఉత్సాహంగా సిద్ధమవుతారు... స్వెట్టర్లు, మఫ్లర్లు ధరిస్తారు... సందడిగా చేపల వేటకు పోటీ పడతారు... ఒక్క చేపను పట్టినా కేరింతలు కొడతారు... ఎందుకంటే ఈ వేట మంచులో కాబట్టి! చలికాలంలోచాలా చోట్ల మంచుపై స్కేటింగ్‌, మంచు శిల్పాలు చేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ ఓ దగ్గర వీటితోపాటు మంచులో చేపల వేట ఉంటుంది.

Published : 07 Jan 2017 01:02 IST

మంచును తవ్వేయ్‌.... చేపను పట్టేయ్‌!

అంతా ఉత్సాహంగా సిద్ధమవుతారు... స్వెట్టర్లు, మఫ్లర్లు ధరిస్తారు... సందడిగా చేపల వేటకు పోటీ పడతారు... ఒక్క చేపను పట్టినా కేరింతలు కొడతారు... ఎందుకంటే ఈ వేట మంచులో కాబట్టి!
లికాలంలోచాలా చోట్ల మంచుపై స్కేటింగ్‌, మంచు శిల్పాలు చేయడం లాంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. కానీ ఓ దగ్గర వీటితోపాటు మంచులో చేపల వేట ఉంటుంది.
* ఐస్‌ ఫెస్టివల్‌ పేరిట దక్షిణ కొరియాలోని హ్వాచియన్‌ సాంచియోనియోలో ఏటా జనవరి 7 నుంచి 29 వరకు ఈ పండగ నిర్వహిస్తారు.
* నీళ్లలో చేపలు పట్టడం మనకు తెలుసు కానీ మంచులో ఏంటీ అనుకుంటున్నారా? ఇక్కడి గాంగ్వన్‌ డూ అనే ప్రావిన్స్‌లో చలికాలంలో గడ్డకట్టుకుపోయే నది ఉంటుంది. ఈ నది దగ్గరే ఈ పండగ జరుపుతుంటారు. మంచులో చేపలు పారదర్శకంగా కనిపిస్తుంటాయి. వీటిని చాకచక్యంగా పట్టుకోవడమే పోటీ. ఈ నదిలో ఉన్న చేపలే కాకుండా నిర్వాహకులు కూడా కొన్ని చేపల్ని ఉంచుతారు.
* మరి ఈ చేపల వేట ఎలా సాధ్యమవుతుంది? ఈ మంచునదిలో రెండు మీటర్ల లోతు వరకు అక్కడక్కడ పెద్ద పెద్ద రంధ్రాలు చేస్తారు. ఒకటో రెండో కాదు... ఈ రంధ్రాలు మొత్తం పన్నెండు వేలకుపైనే ఉంటాయి. వీటిల్లోంచి చేపల్ని కర్రల్లాంటి వాటితో బయటకు తీస్తారన్నమాట. ఎవరు ఎక్కువ చేపల్ని పడితే వారే విజేత.
* ఈ పండగనే ‘మౌంటెన్‌ ట్రౌట్‌ ఐస్‌ ఫెస్టివల్‌’ అని కూడా అంటారు.
* దీంతో పాటు ఐస్‌ స్కేటింగ్‌, నీటి కొలను ఏర్పాటు చేసి అందులో చేతులతో చేపలవేట వంటి ఇతర పోటీలూ పెడతారు
* 2003 నుంచి ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఏటా ఈ ఫెస్టివల్‌ చూడ్డానికి పదిలక్షల మందికిపైనే సందర్శకులు వస్తుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని