బొమ్మల బామ్మ... రికార్డు కొట్టెనమ్మా!

ఎర్రటి కొంగలు... అవేనండీ ఫ్లెమింగోలు తెలుసుగా? అవంటే ఓ బామ్మకు బోలెడంత ఇష్టం. వాటి బొమ్మలంటే మరీనూ. అందుకే ముచ్చటగా అనిపించే ఆ బొమ్మల్ని ఆమె సేకరించడం మొదలు పెట్టింది. అలాంటి వాటితో ఓ గదినే నింపేసింది. దానికి ప్రపంచంలో ఎక్కువ ఫ్లెమింగో బొమ్మల సేకరణ అంటూ గిన్నిస్‌బుక్‌ వారు ఈ మధ్యే రికార్డూ ప్రకటించారు....

Published : 01 Jun 2017 01:32 IST

బొమ్మల బామ్మ... రికార్డు కొట్టెనమ్మా!

ర్రటి కొంగలు... అవేనండీ ఫ్లెమింగోలు తెలుసుగా? అవంటే ఓ బామ్మకు బోలెడంత ఇష్టం. వాటి బొమ్మలంటే మరీనూ. అందుకే ముచ్చటగా అనిపించే ఆ బొమ్మల్ని ఆమె సేకరించడం మొదలు పెట్టింది. అలాంటి వాటితో ఓ గదినే నింపేసింది. దానికి ప్రపంచంలో ఎక్కువ ఫ్లెమింగో బొమ్మల సేకరణ అంటూ గిన్నిస్‌బుక్‌ వారు ఈ మధ్యే రికార్డూ ప్రకటించారు.

* ఈ బామ్మ పేరు కిండీ డన్లో. ఉండేది అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న ఒకాలాలో.

* అక్కడ ఆమెకు ఓ ఫోటో ఫ్రేముల దుకాణముంది. దానిలో ముందు గదంతా ఫ్లెమింగో బొమ్మలతో నిండిపోయి ఉంటుంది.

* ఆ దుకాణం దగ్గర ‘వెల్‌కం టు ద అఫిషియల్‌ ఫ్లోరిడా ఫ్లెమింగో మ్యూజియం’ అని రాసుంటుంది.

* అక్కడున్న వాటిలో ఫోటో ఫ్రేములు, కళ్లజోళ్లు, కాఫీమగ్గులు, చెవి పోగులు, చేతి బ్యాండులు, కర్టెన్‌లు... ఇలా బోలెడు రకాలున్నాయి.

* అలా ఆమె దగ్గర ఇప్పటి వరకు మొత్తం 865 వరకూ బొమ్మలు పోగయ్యాయిట.

* తన దగ్గరున్న బొమ్మల్లో ఐదడుగులపైగా ఎత్తున్న పెద్ద ఫ్లెమింగో బొమ్మంటే తనకెంతో ఇష్టమని చెబుతోంది ఆ బామ్మ.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని