ఇది పర్వతాల భూభాగం!

హెయ్‌టీ... కరేబియన్‌ ద్వీపమైన హిస్పానియోలా భూభాగాన్ని పంచుకునే రెండు దేశాల్లో ఇదో బుల్లి దేశం. 1492లో క్రిస్టఫర్‌ కొలంబస్‌ మొదటిసారిగా ఈ దేశంలో అడుగుపెట్టాడు. 1804 జనవరి 1న ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం పొందిందీ దేశం...

Published : 13 Aug 2017 01:28 IST

ఇది పర్వతాల భూభాగం!
హెయ్‌టీ

* హెయ్‌టీ... కరేబియన్‌ ద్వీపమైన హిస్పానియోలా భూభాగాన్ని పంచుకునే రెండు దేశాల్లో ఇదో బుల్లి దేశం.
* 1492లో క్రిస్టఫర్‌ కొలంబస్‌ మొదటిసారిగా ఈ దేశంలో అడుగుపెట్టాడు.
* 1804 జనవరి 1న ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం పొందిందీ దేశం.
* 1804 - 1915 మధ్యలో 70 మందికిపైగా నియంతలు పరిపాలించారీ దేశాన్ని. అంటే ఈ 111 సంవత్సరాల వ్యవధిలో నియంతల ఆదేశాలే ఈ దేశంలో చలామణీ అయ్యాయన్నమాట.
* కరేబియన్‌ ప్రాంతంలో అత్యధికంగా పర్వతాలున్న దేశమిది. అందుకే దీనికి ‘ల్యాండ్‌ ఆఫ్‌ ది మౌంటెన్స్‌’ అని పేరు. ఇక్కడ 8 వేల అడుగుల ఎత్తయిన పర్వత శిఖరాలుంటాయి.

* జెండా: ప్రపంచ పురాతన జెండాల్లో ఇదీ ఒకటి. వివిధ జాతుల ఏకతను ఈ పతాక రంగులు సూచిస్తాయి. నీలం రంగు ఆఫ్రికా నుంచి వచ్చిన నల్ల జాతీయుల మూలాలకు గుర్తు.

ఇక్కడ స్థిరపడిన విభిన్న ప్రాంత ప్రజలకు ఎరుపు రంగు చిహ్నం.
* ఇక్కడ 53 శాతం మందికి మాత్రమే చదవడం, రాయడం వచ్చు.

* దేశం: హెయ్‌టీ రాజధాని: పోర్టా ప్రిన్స్‌ జనాభా: 1,06,04,000
* విస్తీర్ణం: 27,750 చదరపు కిలోమీటర్లు భాష: ఫ్రెంచ్‌, హెయ్‌టియన్‌ క్రియోల్‌ కరెన్సీ: హెయ్‌టియన్‌ గౌర్డే

* 1950 నుంచి ఇక్కడి స్త్రీలకు ఓటు హక్కు వచ్చింది.
* 1915 అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్‌ హెయ్‌టీ దేశంలో శాంతియుత పరిస్థితుల్ని తీసుకురావడం కోసం తమ నావికదళాన్ని పంపారు.
* 2010లో ఇక్కడ వచ్చిన భారీ భూకంపం రెండు లక్షల మందికిపైగా ప్రజల్ని పొట్టన పెట్టుకుంది. ఎన్నో నిర్మాణాలు నేలమట్టమయ్యాయి. ఆర్థిక వ్యవస్థ కుదేలయింది.

* ఇక్కడి విద్యార్థుల్లో 10 శాతం మంది మాత్రమే ఉన్నత పాఠశాలలో చేరుతారు. మిగిలిన వారంతా ప్రాథమిక పాఠశాలతోనే చదువు ఆపేస్తారు.
* పర్యటక రంగం ఇక్కడ అత్యధికంగా లాభాల్ని తెచ్చిపెట్టే పరిశ్రమ. దేశ దేశాల నుంచి లక్షల్లో సందర్శకులు వస్తుంటారు.
* ఇక్కడ 15 ఏళ్లలోపు పిల్లలు 20 శాతం మంది కంటే తక్కువగా ఉంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని