కేవ్‌ కేక!

నీటి అడుగున ఓ గుహ ఉంది... ప్రపంచంలోనే అతి పొడవైనది... ఆ సంగతి ఇప్పుడే బయటపడింది... మరింకెందుకాలస్యం... ఆ వివరాలేంటో మనమూ చదివేద్దాం! గుహ అంటే భూమి మీద రాళ్లతో ఉండేదేే గుర్తొస్తుంది మనకు. అయితే ఓ చిత్రమైన గుహ ఉంది. ఎక్కడంటే మెక్సికో సముద్ర తీరంలో. నీళ్లలో ఉండే గుహల్లో ప్రపంచంలో ఇదే పొడవైనది. ఇదే దీని అసలు ప్రత్యేకత. గుహ అంటే ఏ రెండు, మూడు కిలోమీటర్ల పొడవుంటుందనుకుంటారేమో.. దీని పొడవు ఏకంగా 347 కిలోమీటర్లుంది. అంటే దాదాపుగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లినంత దూరం.

Published : 19 Jan 2018 02:01 IST

కేవ్‌ కేక!

టి అడుగున ఓ గుహ ఉంది...
ప్రపంచంలోనే అతి పొడవైనది...
ఆ సంగతి ఇప్పుడే బయటపడింది...
మరింకెందుకాలస్యం... ఆ వివరాలేంటో మనమూ చదివేద్దాం!

గుహ అంటే భూమి మీద రాళ్లతో ఉండేదేే గుర్తొస్తుంది మనకు. అయితే ఓ చిత్రమైన గుహ ఉంది. ఎక్కడంటే మెక్సికో సముద్ర తీరంలో. నీళ్లలో ఉండే గుహల్లో ప్రపంచంలో ఇదే పొడవైనది. ఇదే దీని అసలు ప్రత్యేకత. గుహ అంటే ఏ రెండు, మూడు కిలోమీటర్ల పొడవుంటుందనుకుంటారేమో.. దీని పొడవు ఏకంగా 347 కిలోమీటర్లుంది. అంటే దాదాపుగా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లినంత దూరం.
* ఒకసారి ఉత్తర అమెరికా ఖండంలో ఉన్న మెక్సికో దేశ తూర్పు తీరంలో డైవర్లు సరదాగా డైవింగ్‌కి దిగారు. కాళ్లూపుతూ అటూ ఇటూ తిరుగుతూ సంద్రంలోపలి అందాల్ని చూస్తున్నారు. అంతలోనే అక్కడ ఓ గుహ కనిపించింది. దాని పై భాగం అంతా ఎంతో చిత్రంగా అనిపించింది. రాయి కరిగి కిందికి కారుతోందా అన్నట్లుంది. వెళ్లే కొద్దీ లోపలికి దారి కనిపిస్తూనే ఉంది.
* ఆ గుహకు దగ్గర్లో ఇంకొంత మంది డైవర్లు డైవింగ్‌కి వెళ్లారు. వీళ్లకి ఇంకో గుహ అక్కడ కనిపించింది. దీంతో ఇక్కడ రెండు గుహలున్నాయని అంతా అనుకున్నారు. ఇది ఇప్పటి సంగతి కాదు. ఒకప్పటిది.

ప్పటి వరకు మెక్సికో దగ్గరే తులుమ్‌లో 268 కిలోమీటర్ల గుహ అత్యంత పొడవైనది.  ఇప్పుడు ఈ కొత్త గుహ బయటపడటంతో ఈ రికార్డు చెరిగిపోయింది.

* ఈ రెండు గుహల మీద పరిశోధనలు చేయడానికి ఈసారి శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. గతేడాది వీరి బృందం వీటిపై పరిశోధనలు మొదలుపెట్టింది. ముఖానికి ఆక్సిజన్‌ సిలిండర్లు కట్టుకుని, చేతిలో లైట్లున్న మాస్కులు వేసుకుని, కొలిచేందుకు కొలతను చేత పట్టుకుని ఓ గుహలోకి బయలుదేరారు. చూస్తే పై రెండు గుహలూ ఓ దగ్గర కలిసి ఉన్నాయి. ఏమిటా అని ఆరాతీస్తే ఇవి రెండూ కలిపి ఒకే పొడవైన గుహ అని తెలిసి  ఆశ్చర్యపోయారు. ప్రపంచంలో ఇలాంటి వాటిలో ఇదే పొడవైన గుహ అని తేల్చారు. దీనికి డోస్‌ ఓజోస్‌ కేవర్న్‌ సిస్టమ్‌ అని పేరూ పెట్టారు.
* ఈ కొత్త విషయం కనుక్కోవడానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంచుమించు ఏడాది సమయం పట్టిందన్నమాట.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని