Mahesh Babu: మహేశ్‌ బాబు, మమ్ముట్టి, షారుక్‌లతో సినిమా.. నెల్సన్‌ ప్లాన్‌ ఇదే..

ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ చెప్పారు. 

Published : 26 Apr 2024 20:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రజనీకాంత్‌ హీరోగా ‘జైలర్‌’ను తెరకెక్కించి అందరి దృష్టిని ఆకర్షించారు దర్శకుడు నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ (Nelson Dilipkumar). ఆ చిత్రంలో ఎంతోమంది అగ్ర హీరోలు అతిథి పాత్రల్లో కనిపించి మెప్పించారు. తాజాగా నెల్సన్‌ ఓ అవార్డు వేడుకలో తన ప్లాన్‌ గురించి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముగ్గురు హీరోలను స్క్రీన్‌పై చూపించడం తన కల అన్నారు.

‘ఒకవేళ నేను కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ సినిమాకు దర్శకత్వం వహిస్తే అందులో మరికొందరు అగ్ర కథానాయకులను కూడా చూపిస్తాను. టాలీవుడ్‌ నుంచి మహేశ్‌బాబు, బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌, మలయాళం టాప్‌ హీరో మమ్ముట్టిలకు కీలకపాత్రలు ఇస్తాను. అది నా కల. అలాగే అందులో మహిళా ప్రధాన పాత్ర ఉంటే తప్పకుండా నా మొదటి ఎంపిక నయనతారనే’ అని చెప్పారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో నిజంగా సినిమా వస్తే బ్లాక్‌బస్టర్‌ అవుతుందని కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం నెల్సన్‌ - రజనీకాంత్‌ల కాంబోలో మరో చిత్రం రానుందని వార్తలు వస్తున్నాయి. ‘జైలర్‌ 2’ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నట్లు టాక్‌. తాజాగా పవర్‌ఫుల్‌ సీక్వెల్‌కు ‘హుకుం’(Hukum) అనే టైటిల్‌ను ఖారారు చేసినట్లు కూడా ప్రచారం జరిగింది. రజనీకాంత్‌కు నెల్సన్‌ స్క్రిప్ట్‌ కూడా వినిపించగా, ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని