నవ్వుల్‌... నవ్వుల్‌..!

టీచర్‌ : రాకీ.. హోంవర్క్‌ ఎందుకు పూర్తి చేయలేదు?

Published : 07 May 2022 00:27 IST

పెద్ద ప్లానే!

టీచర్‌ : రాకీ.. హోంవర్క్‌ ఎందుకు పూర్తి చేయలేదు?
రాకీ : బంధువులొచ్చారు టీచర్‌.. త్వరగా ఇంటికెళ్లిపోదామనీ..

టీచర్‌ : నేను అడిగేదేంటి? నువ్వు చెప్పేదేంటి?
రాకీ : హోంవర్క్‌ చేయనివాళ్లను ఇంటికి పంపించేస్తానని మొన్న చెప్పారు కదా టీచర్‌.. అందుకే.!

టీచర్‌ : ఆ..!!

సెలవులంటే ప్రాణం...

అమ్మ : ఏంటి టిల్లూ.. దేని గురించో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావు?
టిల్లు : మరేం లేదమ్మా.. కాలం ఇలాగే ఆగిపోతే ఎంత బావుండు అనీ..
అమ్మ : ఏం ఎందుకలా?
టిల్లు : వేసవి సెలవులు కాబట్టి..

అవీ గ్రహాలేనా?

టీచర్‌ : రమా.. నీకు తెలిసిన రెండు గ్రహాల పేర్లు చెప్పు?
రమ : ఆగ్రహం, అనుగ్రహం టీచర్‌..

టీచర్‌ : ఆ..!!

అలా వచ్చావా!

నాన్న : అరే.. బారెడు పొద్దెక్కినా.. ఇంకా లేవలేదేంట్రా?
పవన్‌ : అది కాదు నాన్నా.. వేసవి సెలవుల్లో టీచర్‌ ఏదైనా నేర్చుకొని రమ్మన్నారు..
నాన్న : అయితే..!
పవన్‌ : నేను ఎక్కువసేపు నిద్రపోవడం ప్రాక్టీస్‌ చేస్తున్నా నాన్నా..


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని