వీహ విజయం పుస్తకమే..!

హాయ్‌ నేస్తాలూ..! సాధారణంగా అయితే మనం క్లాస్‌లో టీచర్‌ చెప్పే పాఠాలు వినడానికే బద్ధకిస్తాం. ఇంకా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తాం.. నిలబడి ఏదైనా సమాధానం చెప్పమన్నా.. భయంతో అస్సలు ఏమీ చెప్పలేం. అంతే కదా! కానీ ఓ చిన్నారి మాత్రం ఓ ప్రముఖ వేదిక మీద చాలా చక్కగా మాట్లాడి అందరి ప్రశంసలు పొందింది.

Published : 24 Feb 2024 05:06 IST

హాయ్‌ నేస్తాలూ..! సాధారణంగా అయితే మనం క్లాస్‌లో టీచర్‌ చెప్పే పాఠాలు వినడానికే బద్ధకిస్తాం. ఇంకా ఎప్పుడు అయిపోతుందా అని ఎదురు చూస్తాం.. నిలబడి ఏదైనా సమాధానం చెప్పమన్నా.. భయంతో అస్సలు ఏమీ చెప్పలేం. అంతే కదా! కానీ ఓ చిన్నారి మాత్రం ఓ ప్రముఖ వేదిక మీద చాలా చక్కగా మాట్లాడి అందరి ప్రశంసలు పొందింది. మరి తనెవరో ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

హారాష్ట్రకు చెందిన వీహ మాలవ్‌ మెహతాకు ఏడు సంవత్సరాలు. ప్రస్తుతం తను రెండో తరగతి చదువుతోంది. ఈ వయసు పిల్లలంతా ఎంచక్కా స్కూల్‌కి వెళ్లొచ్చి.. ఏదైనా హోంవర్క్‌ ఉంటే చేసుకొని, ఆడుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇంకొందరైతే.. అసలు స్కూల్‌కి వెళ్లడానికే మారాం చేస్తూ ఉంటారు. కానీ మన వీహ మాత్రం టెడ్‌ ఎక్స్‌లో ఆన్‌లైన్‌ ఉపన్యాలు ఇస్తోంది. తన ప్రతిభతో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

సాధనతోనే..

మన వీహకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టమట. అందులోనూ కథల పుస్తకాలు ఎక్కువ. ఇంట్లో వాళ్లతో కూడా కథలు చెప్పించుకుంటుందట. అంతే కాకుండా తను నేర్చుకున్న విషయాన్ని ఇతరులకు కూడా చెబుతుందట. అందుకే అంత బాగా మాట్లాడగలుగుతోందట. టెడ్‌ ఎక్స్‌లో తన చిన్నప్పటి విషయాలు, పుస్తకాల గురించి అందరికీ అర్థమయ్యేలా చాలా చక్కగా వివరించింది. బయటికి వెళ్లినప్పుడు వాళ్ల అమ్మానాన్నలను అడిగి మరీ, బొమ్మల కంటే ఎక్కువ పుస్తకాలే కొనిపించుకుంటుందట. ఆశ్చర్యంగా ఉంది కదూ! కానీ ఇది నిజమే నేస్తాలూ.. స్కూల్లో జరిగే అన్ని కార్యక్రమాల్లో కూడా తను చాలా చురుగ్గా పాల్గొంటుందట. ‘పుస్తకాలు చదవడమే కాదు.. అందులోని పదాలను కూడా బాగా అర్థం చేసుకోవాలి. అది మన స్నేహితులకు వివరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే మనకు చాలా విషయాలు తెలుస్తాయి’ అని చెబుతోంది వీహ. ఈ చిన్నారి టాలెంట్‌ని గుర్తించిన ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’, ‘ఏషియన్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు అందులో స్థానం కల్పించారు. ఎంతైనా మన వీహ చాలా గ్రేట్‌ కదూ..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని