థ్రిల్లర్‌ కథలు రాసేస్తున్నాడు..!

హాయ్‌ నేస్తాలూ..! మనం కథలు చదవడానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా.. వినడానికి మాత్రం ముందే ఉంటాం. అమ్మనాన్నల ఫోన్‌ తీసుకొని ఎంచక్కా అందులో వినేస్తాం. లేకపోతే.. ఇంట్లో నానమ్మ, తాతయ్యలతో చెప్పించుకుంటాం!

Published : 12 Apr 2024 00:41 IST

హాయ్‌ నేస్తాలూ..! మనం కథలు చదవడానికి పెద్దగా ఆసక్తి చూపకపోయినా.. వినడానికి మాత్రం ముందే ఉంటాం. అమ్మనాన్నల ఫోన్‌ తీసుకొని ఎంచక్కా అందులో వినేస్తాం. లేకపోతే.. ఇంట్లో నానమ్మ, తాతయ్యలతో చెప్పించుకుంటాం! అలాంటి కథలే ఓ చిన్నారి రాస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు. మరి తనెవరో.. ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

ధ్యప్రదేశ్‌కి చెందిన స్థవ్య గార్గ్‌కి పదకొండు సంవత్సరాలు. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్నాడు. మనలాగే తనకు కూడా కథలు వినడం అంటే చాలా ఇష్టమట. తను చిన్నప్పటి నుంచి కాస్త సమయం దొరికినా.. నానమ్మ, తాతయ్యలతో కథలు చెప్పించుకునేవాడట. తను వినడమే కాకుండా స్కూల్‌కి వెళ్లాక.. స్నేహితులకు కూడా వివరించేవాడట. అలా అతనికి కథల మీద ఇంకా ఎక్కవ ఆసక్తి కలిగింది.

థ్రిల్లర్‌ కథలు..

మన గార్గ్‌కి థ్రిల్లర్‌ కథలంటే చాలా ఇష్టమట. ఎక్కువగా ఆ కథలు వినడానికే ఇష్టపడేవాడట. అలా వింటూ వింటూనే.. కొన్ని రోజులకు తనే కథలు రాయడం ప్రారంభించాడు. ఇప్పటి వరకు దాదాపు 12 షార్ట్‌ స్టోరీస్‌ రాశాడట. అందులో అన్నీ థ్రిల్లర్‌ కథలేనట. ఆ పుస్తకానికి.. ‘ది ట్విస్టెడ్‌ టేల్స్‌’ అని పేరు పెట్టాడు. ఇందులోని కథలు మనుషుల నడవడిక, ఎదుర్కొనే సమస్యల గురించి ఉంటాయట. ‘చూస్తే.. మాలాగే ఉన్నాడు.. మేము స్కూల్లో ఇచ్చిన హోంవర్క్‌ చేయడానికే ఇబ్బంది పడుతుంటాము.. కానీ తను మాత్రం భలేగా కథలు రాసేస్తున్నాడే’ అని ఆశ్చర్యపోతున్నారు కదూ! కానీ నిజంగానే తను అన్ని కథలు రాశాడట. మరో విషయం ఏంటంటే.. తన పుస్తకం అతి తక్కువ కాలంలో మంచి ఆదరణ పొందింది. ప్రస్తుతం ఆన్‌లైన్‌ వేదికగా వాటిని అమ్ముతున్నాడు. ఈ పుస్తకానికి ‘గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ అవార్డు 2024’ కూడా వచ్చింది. ఇంతటి ఘనత సాధించిన స్థవ్య గార్గ్‌ని ‘ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’ వారు గుర్తించి.. అవార్డు అందించారు. ఎంతైనా ఈ చిన్నారి చాలా గ్రేట్ కదూ! ఎలాగూ వేసవి సెలవులు వస్తున్నాయి కదా.. మరి మనం కథలు చదవడమైనా.. అలవాటు చేసుకుందామా..!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని