రోజ్‌ సంగీత మహిమ..!

హాయ్‌ నేస్తాలూ..!  ఎవరైనా మన ముందు.. పియానో, గిటార్‌ లాంటివి వాయించినప్పుడు.. ‘నాకు కూడా వస్తే ఎంత బాగుండో!’ అనుకుంటాం. కొన్నిసార్లు వాయించడానికి ప్రయత్నిస్తాం కూడా.. అంతే కదా! అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా?

Published : 23 May 2024 00:26 IST

హాయ్‌ నేస్తాలూ..!  ఎవరైనా మన ముందు.. పియానో, గిటార్‌ లాంటివి వాయించినప్పుడు.. ‘నాకు కూడా వస్తే ఎంత బాగుండో!’ అనుకుంటాం. కొన్నిసార్లు వాయించడానికి ప్రయత్నిస్తాం కూడా.. అంతే కదా! అయినా ఇప్పుడు ఇదంతా ఎందుకంటారా? ఓ చిన్నారి తన మ్యూజిక్‌తోనే రికార్డు సృష్టిస్తోంది. సంగీత పరికరాలు వాయించడానికి వయసుతో సంబంధం లేదని నిరూపిస్తోంది. మరి తనెవరో? ఆ వివరాలేంటో తెలుసుకుందామా..!

కోల్‌కతాకు చెందిన రోజ్‌ డామ్‌ రాయ్‌కి పదకొండు సంవత్సరాలు. ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోంది. తనకు చిన్నప్పటి నుంచి సంగీతం మీద ఉన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. ఇప్పటికే తను 4వ స్థాయి డిప్లొమా ఇన్‌ మ్యూజిక్‌ పెర్ఫామెన్స్‌ పూర్తి చేసింది. ఆశ్చర్యంగా ఉంది కదూ..! తన తోటి పిల్లలంతా పుస్తకాలతో కుస్తీ పట్టడానికే సమయం సరిపోవట్లేదంటుంటే.. రోజ్‌ మాత్రం చదువుతో పాటు సంగీతంలోనూ రికార్డు సృష్టిస్తోంది. తన ప్రదర్శనల వల్ల ప్రతిరోజు స్కూల్‌కి వెళ్లలేకపోయినా.. చదువులోనూ ఎప్పుడూ ముందే ఉంటుందట. 

ఎన్నో ప్రదర్శనలు..!

మన రోజ్‌ పియానో చాలా బాగా వాయిస్తుంది. ఇప్పటి వరకు తను వందల సంఖ్యలో ప్రదర్శనలు ఇచ్చి.. పలు అవార్డులు, పతకాలు సొంతం చేసుకుంది. మరో విషయం ఏంటంటే.. ‘అసోసియేట్‌ ఆఫ్‌ రాయల్‌ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’, లండన్‌లోని ‘ది అసోసియేటెడ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ది రాయల్‌ స్కూల్స్‌ ఆఫ్‌ మ్యూజిక్‌’ నుంచి అంతర్జాతీయ స్థాయి డిప్లొమా సర్టిఫికేట్‌ సాధించింది. తన ప్రదర్శనలు వీక్షించడానికి పెద్ద సంఖ్యలో జనాలు కార్యక్రమాలకు వస్తుంటారట. ఎంతసేపైనా సరే.. అస్సలు అలసిపోకుండా మ్యూజిక్‌ వాయిస్తూనే ఉంటుందట. ఎంతైనా ఈ చిన్నారి చాలా గ్రేట్‌ కదూ.. భవిష్యత్తులో తను అనుకున్న లక్ష్యాలను చేరుకోవాలని మనమూ ‘ఆల్‌ ది బెస్ట్‌’ చెప్పేద్దామా!  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని