శెభాష్ లీనా..!
హాయ్ ఫ్రెండ్స్.. మనకు సెల్‌ఫోనో, కంప్యూటరో ఇస్తే.. ఏం చేస్తాం?’ - ఆ.. ఏముంది.. ఎంచక్కా ఆటలు ఆడుకుంటూనో, కార్టూన్ సినిమాలు చూస్తూనో సరదాగా గడిపేస్తాం.
హాయ్ ఫ్రెండ్స్.. మనకు సెల్‌ఫోనో, కంప్యూటరో ఇస్తే.. ఏం చేస్తాం?’ - ఆ.. ఏముంది.. ఎంచక్కా ఆటలు ఆడుకుంటూనో, కార్టూన్ సినిమాలు చూస్తూనో సరదాగా గడిపేస్తాం. కానీ, ఓ నేస్తం మాత్రం చిన్న వయసులోనే ఓ ఆప్‌ను రూపొందించింది. అందరితోనూ శెభాష్ అనిపించుకుంటోంది. ఇంతకీ ఆ నేస్తం ఎవరో, తాను తయారు చేసిన ఆ ఆప్ ఏంటో తెలుసుకుందామా..!
కేరళకు చెందిన లీనా రఫీక్‌కు ప్రస్తుతం 11 సంవత్సరాలు. ఈ వయసులోనే స్కానర్ సహాయంతో కళ్ల సమస్యను గుర్తించే ‘ఓగ్లర్’ అనే ఆప్‌ను రూపొందించింది. ప్రస్తుతానికైతే ఐఫోన్లలో మాత్రమే పనిచేసే ఈ ఆప్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిందట.
స్కాన్ చేస్తే చాలు..
లీనాకు చిన్నతనం నుంచే టెక్నాలజీ, కోడింగ్ అంటే చాలా ఇష్టమట. తన ఆసక్తిని చూసి తల్లిదండ్రులూ ప్రోత్సహించారు. స్థానికంగా జరిగే వాటితోపాటు ఆన్‌లైన్ వేదికగానూ అనేక పోటీల్లో పాల్గొని సత్తా చాటింది. తనకు పదేళ్ల వయసున్నప్పుడు అంటే గతేడాది.. ఏఐ సహాయంతో పనిచేసే ఓగ్లర్ ఆప్‌ను తయారు చేసింది. ఈ ఆప్‌లో ఉండే స్కానర్ సహాయంతో కళ్లను స్కాన్ చేస్తే.. క్షణాల్లో వాటి స్థితిగతులు తెలిసిపోతాయట. కళ్లలోని రెటీనా, శుక్లాలు, పొడిబారడం, ఎరుపెక్కడం తదితర సమస్యలు ఏవైనా అందులోని ప్రోగ్రామ్ గుర్తిస్తుంది. ఆ పరీక్ష ఫలితాల ఆధారంగా తగిన చికిత్స తీసుకోవచ్చట. అంటే ఆసుపత్రికి వెళ్లే పని లేకుండా, పెద్ద పెద్ద పరీక్షల నిమిత్తం గంటల తరబడి ఎదురుచూడకుండా కేవలం ఈ ఆప్ సాయంతో చిటికెలో కళ్ల కథ చెప్పేస్తుందన్నమాట.
ఆరు నెలల కష్టం..
సొంతంగా ఆప్ తయారు చేయడం అంటే మాటలు కాదు కదా నేస్తాలూ.. లీనా అయితే ఈ ఆప్ డిజైన్ కోసం దాదాపు ఆరు నెలలు కష్టపడిందట. ఎటువంటి థర్డ్‌పార్టీ ఆప్స్ సహాయం లేకుండానే.. వివిధ రకాల కళ్ల సమస్యలు, వాటిని గుర్తించడంతోపాటు పరిష్కారాలపైనా బోలెడు అధ్యయనం చేసిందట. ప్రస్తుతం ఈ ఆప్‌ను ఆపిల్ కంపెనీ వాళ్లు పరీక్షిస్తున్నారట. అంతా బాగానే ఉందనుకున్న తర్వాత.. ‘ఐస్టోర్’లో అందుబాటులోకి తీసుకురానున్నారు. సామాన్యులకు ఉపయోగపడే ఇటువంటి ఆప్స్‌ను భవిష్యత్తులో మరిన్ని రూపొందిస్తానని ధీమాగా చెబుతోంది లీనా. ఈ వివరాలన్నింటినీ స్వయంగా తనే సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. అది చూసిన వారంతా లీనాను అభినందిస్తున్నారు. చిన్న వయసులోనే ఇంత ప్రయోజనకరమైన ఆప్‌ను అభివృద్ధి చేయడం గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు. నేస్తాలూ.. మనమూ తనకు ఆల్ ది బెస్ట్ చెప్పేద్దాం మరి!
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Weather: మూడు రోజులపాటు తెలంగాణలో మోస్తరు వర్షాలు!
-
Crime News
Gold: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 2 కిలోల బంగారం పట్టివేత
-
Sports News
WTC Final: ఐపీఎల్‌తో ఆత్మవిశ్వాసం వచ్చినా.. ఇది విభిన్నం: శుభ్‌మన్ గిల్
-
Politics News
Pattabhi: ఉద్యోగులకు మళ్లీ అన్యాయమే: పట్టాభి
-
India News
NIA: ఖలిస్థాన్ ‘టైగర్ ఫోర్స్’పై ఎన్ఐఏ దృష్టి.. 10 చోట్ల ఏకకాలంలో దాడులు
-
General News
TS Government: ₹లక్ష ప్రభుత్వ సాయం.. అప్లై చేసుకోండిలా..