కురుల రంగుకు రూ.55 లక్షలు

మేకప్‌ కోసం కోట్లు ఖర్చుపెట్టిన హీరోలను చూశాం. కత్తిలాంటి ఫిగర్‌ కోసం కఠోర కసరత్తులు.....

Published : 03 Feb 2016 16:55 IST

కురుల రంగుకు రూ.55 లక్షలు

మేకప్‌ కోసం కోట్లు ఖర్చుపెట్టిన హీరోలను చూశాం. కత్తిలాంటి ఫిగర్‌ కోసం కఠోర కసరత్తులు చేసిన భామల్ని గాంచాం. డ్రెస్‌ కోసమే బోలెడు డబ్బులు కుమ్మరించిన హీరోయిన్లూ ఉన్నారు. కానీ కురుల రంగుకే రూ.55 లక్షలు అద్దింది మాత్రం కత్రినా కైఫ్‌ మాత్రమే. ఔను ఇది నిజం. ఫితూర్‌లో పాత్ర స్వభావం రీత్యా కత్రినా కురులకు ఎరుపురంగు ఉండాలి. దాని కోసం ముందు బాలీవుడ్‌ హెయిర్‌స్టైలిస్ట్‌లతో ప్రయత్నించారు. కానీ అనుకున్న రూపు రాలేదు. తర్వాత లండన్‌కి చెందిన నిపుణుడిని రప్పించారు. మరిన్ని మెరుగుల కోసం క్యాట్‌ కూడా లండన్‌ ఫ్లైటెక్కాల్సి వచ్చింది. ఇంకేం... ఖర్చు తడిసి మోపెడైంది. ఇదే విషయం దర్శకుడు అభిషేక్‌కపూర్‌ని అడిగితే ‘కశ్మీరీ అమ్మాయి, చినార్‌ చెట్లు ఎంత అందంగా ఉంటాయి? మరి ఆ అందం రావాలంటే ఈ మాత్రం ఖర్చు భరించాల్సిందే’ అంటున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని