logo

కొండయ్య.. లెక్కే వేరు

ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం.

Updated : 26 Apr 2024 08:06 IST

ఆర్వోకు నామపత్రాలు అందజేస్తున్న కొండయ్య

ఉదయగిరి, న్యూస్‌టుడే : ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసేవారిలో ఎక్కువ మంది రాజకీయ, ఆర్థిక, సామాజిక బలాలున్న వారే ఉంటున్నారు. కొందరు పార్టీల తరఫున ఇంకొందరు ప్రధాన పార్టీల అభ్యర్థులకు అనుకూలంగా వ్యవహరించటానికి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేయటం సాధారణం. ఎలాంటి ఉద్దేశం లేకుండా ఎమ్మెల్యేగా నామినేషన్‌ వేయాలనే ఉత్సాహంతో అతి సామాన్యుడైన లెక్కల కొండయ్య (73) అనే వృద్ధుడు  ఉదయగిరి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గం వింజమూరు మండలం నల్లగొండ్ల గ్రామానికి చెందిన లెక్కల కొండయ్య ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నామినేషన్‌ వేయటం స్థానికులకు ఆసక్తి కలిగించింది. నాలుగవ తరగతి వరకు చదివిన ఈయన మండల కేంద్రాల్లో మైక్‌ పట్టుకొని రెవెన్యూ సమస్యలపై స్థానికులకు అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఆర్వో కార్యాలయాన్ని సంప్రదించి అవసరమైన పత్రాలు పొందుపరచి నామినేషన్‌ దాఖలు చేశారు. కొండయ్యకు రూ. 11 వేల చరాస్తి, రూ. 9 లక్షల విలువైన స్థిరాస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని