కుర్రకారు.. ఆన్‌లైన్‌లో పడిపోతున్నారు

కాలేజీలు... పెళ్లిళ్లు... పార్టీలు... గుళ్లూగోపురాలు... రెండు యువహృదయాల మధ్య ప్రేమ జ్వలించే.....

Published : 03 Feb 2016 17:00 IST

కుర్రకారు.. ఆన్‌లైన్‌లో పడిపోతున్నారు

కాలేజీలు... పెళ్లిళ్లు... పార్టీలు... గుళ్లూగోపురాలు... రెండు యువహృదయాల మధ్య ప్రేమ జ్వలించే స్థావరాలు. అది గతం. ట్రెండ్‌ మారింది బాస్‌! ఇప్పుడు ప్యార్‌ కోసం కుర్రకారు కేర్‌కేర్‌మంటోంది ఆన్‌లైన్‌లోనే అన్నది వాస్తవం. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సాప్‌... ఇవన్నీ ప్రేమ పుట్టించే కేంద్రాలే. భవిష్యత్తులో వీటి స్థానంలో డేటింగ్‌ యాప్స్‌ వచ్చి చేరతాయంటున్నాడు సుమేశ్‌ మీనన్‌. woo యాప్‌ వ్యవస్థాపకుడు. మొహమాటాలు, ముసుగులు వదిలేసిన నేటి యువత స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఉండటానికి తమలాంటి వ్యక్తిత్వాలు, భావాలు ఉన్న యువతతో అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ యాప్స్‌ని వేదికగా మలుచుకుంటున్నారు అంటున్నాడు మీనన్‌.Tinder, Thrill, OKcupid లాంటి యాప్స్‌కు పెరిగిపోతున్న పాపులారిటీ సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తోంది. 2015 లెక్కల ప్రకారం దేశంలో దాదాపు రెండుకోట్ల మంది యంగిస్థాన్‌లు ఈ యాప్స్‌ని తమ స్మార్ట్‌ఫోన్లలో నిక్షిప్తం చేసుకున్నారు. ఇందులో అమ్మాయిల వాటా నలభైమూడు శాతం. ఆర్నెళ్లలో ఈ సంఖ్య రెట్టింపవుతుందని అంచనా.

కేరకమైన భావాలు, వ్యక్తిత్వం, అభిప్రాయాలు ఉన్నవాళ్లని ఒక్కచోటికి చేరుస్తాం అన్నది యాప్స్‌ చెప్పేమాట. నిజంగానే ఇవి రెండు మనసుల మధ్య వారధిగా పని చేస్తున్నాయా? అంటే ‘ఇద్దరు అపరిచితుల మధ్య పరిచయం పెంచడానికి ఉపయోగపడొచ్చుగానీ, రెండు మనసుల్ని కచ్చితంగా కలపలేవు. కానీ తమలోని భావోద్వేగాలు పంచుకోవడానికి పనికొస్తాయి’ అంటోంది హెచ్‌ ఎగ్జిక్యూటివ్‌ తేజస్వి. అయితే ‘ఒకేరకమైన వ్యక్తిత్వాలున్నవాళ్లు ఎక్కడో ఉంటారు. ఆ ఇద్దర్ని కలపడానికి ఇంతకుమించి మంచి దారులేం ఉంటాయి’ అన్నది క్రిశాంక్‌ ప్రశ్న. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా రాబోయే రోజుల్లో డేటింగ్‌ యాప్స్‌దే హవా అని గణాంకాలు నిరూపిస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని