Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 26 Apr 2024 09:00 IST

1. ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్‌ అభ్యంతరకర వ్యాఖ్యలు

పులివెందులలో సీఎం జగన్‌ చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. సొంత చెల్లెళ్లపై ఆయన మాట్లాడిన తీరును చూసి జనం మండిపడుతున్నారు. పులివెందుల బిడ్డనంటూ ఎంతో గొప్పగా చెప్పుకొనే జగన్‌ మాట్లాడిన తీరుపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. పూర్తి కథనం

2. 2 దశాబ్దాల తర్వాత పోటీకి దూరంగా కేసీఆర్‌ కుటుంబం

రెండు దశాబ్దాల తర్వాత మొదటిసారిగా కేసీఆర్‌ కుటుంబం లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంది. 2001లో భారాస (అప్పటి తెరాస) ఆవిర్భావం తర్వాత తొలిసారిగా కేసీఆర్‌ కుటుంబం నుంచి ఎవరూ లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగడం లేదు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో (2004లో) కేసీఆర్‌ సిద్దిపేట అసెంబ్లీ, కరీంనగర్‌ లోక్‌సభ స్థానాలకు పోటీచేసి.. రెండుచోట్లా విజయం సాధించారు.పూర్తి కథనం

3. బుగ్గనా.. ఈ అరాచకాలు తగునా?

నంద్యాల జిల్లా డోన్‌ వైకాపా అభ్యర్థి, రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డిలో అసహనం పరాకాష్ఠకు చేరినట్టుంది. గ్రామ సమస్యలపై ప్రశ్నించిన కారణంగా వృద్ధుడైన ఓ వార్డు సభ్యుడిని రెండు రోజుల పాటు పోలీసు నిర్బంధంలో ఉంచి వేధించడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది.పూర్తి కథనం

4. ‘యూటీఎస్‌’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్‌ టికెట్‌ కొనచ్చు..

కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్‌ టికెట్‌ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. దీంతో రైల్వేశాఖ గతంలోనే యూటీఎస్‌(అన్‌రిజర్వుడ్‌ టికెటింగ్‌ సిస్టమ్‌) యాప్‌ను తీసుకువచ్చింది.పూర్తి కథనం

5. చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్‌

రాజకీయాలకు దూరంగా తటస్థంగా ఉన్న చిరంజీవిని విమర్శిస్తే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని అనకాపల్లి పార్లమెంట్‌ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ వైకాపా నాయకులను హెచ్చరించారు. చోడవరం అసెంబ్లీ కూటమి అభ్యర్థి కేఎస్‌ఎన్‌ఎస్‌ రాజు నామినేషన్‌ సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో సీఎం రమేశ్‌ ప్రసంగించారు.పూర్తి కథనం

6. విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!

అధికారంలోకి వచ్చాక మీరేం చేశారు? అసలు బోధనా రుసుములను ఎప్పుడు విడుదల చేస్తున్నారో మీకు తెలుసా? అసలు ఎంత మందికి జమవుతున్నాయి? అదీ ఎన్నాళ్లకో.. ఏనాడైనా ఆరా తీశారా? పేద విద్యార్థుల చదువుల బాధ్యతను మీ అన్న జగన్‌ తీసుకున్నాడని సభల్లో చేతులు ఊపుతూ చెప్పడమే తప్ప ఆచరణలో ఏం చేశారో గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి సీఎంగారూ!పూర్తి కథనం

7. రారండోయ్‌.. ఓటేయడానికి ఆంధ్రాకు

ఎన్నికలంటే ఎప్పుడైనా సందడే.. ఓటర్లను కూడగట్టడం ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్న పని. ప్రస్తుత ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ప్రతిష్ఠాత్మకమని భావిస్తున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఓటు ఉండి.. నగరంలో నివాసముంటున్న వారికి ఆంధ్రా నేతల నుంచి ఎన్నికల పిలుపువచ్చింది. ఎంతమంది ఓటర్లున్నారో తెలుసుకుని వాహనాలు ఏర్పాటు చేస్తున్నారు.పూర్తి కథనం

8. గొప్పల మావయ్యా.. దీవెన ఏదయ్యా?

కళాశాలల నుంచి తల్లిదండ్రులకు ఫీజులు చెల్లించాలని.. తీవ్ర ఒత్తిడి పెరిగింది. దీంతో ఏం చేయాలో తెలియక.. అప్పులు చేసి ఫీజులు కడుతున్నారు. గతంలో బోధన రుసుం నేరుగా కళాశాలలకే వచ్చేది. అందుకే.. తల్లిదండ్రులను కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేసేవి కావు. కానీ.. జగన్‌ వచ్చాక.. తల్లుల ఖాతాల్లో వేస్తాం, వాళ్లే వెళ్లి కట్టాలనే మెలిక పెట్టారు.పూర్తి కథనం

9. ‘అభివృద్ధి మరిచి తిట్లతో పాలిస్తున్నారు’

కాంగ్రెస్‌ ప్రభుత్వం అభివృద్ధి, ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి తిట్ల పురాణంతో పాలన సాగిస్తుందని మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. గురువారం మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డితో కలిసి ఎల్బీనగర్‌ నుంచి మెట్రోలో ప్రయాణం చేసి ప్రయాణికులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కూకట్‌పల్లి మెట్రోస్టేషన్‌ వరకు ప్రచారం చేశారు.పూర్తి కథనం

10. రాయ్‌బరేలీ నుంచి పోటీ.. వరుణ్ గాంధీకి భాజపా ఆఫర్‌?

కాంగ్రెస్‌కు కంచుకోటగా పేరొందిన రాయ్‌బరేలీ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి రెబల్‌ నేత వరుణ్‌గాంధీని నిలబెట్టేందుకు భాజపా ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన్ను కాషాయ పార్టీ సంప్రదించినట్లు సమాచారం. అయితే.. పార్టీ ప్రతిపాదనను ఆయన తోసిపుచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకగాంధీని రంగంలోకి దింపాలని కాంగ్రెస్‌ చూస్తోన్న సమయంలో.. భాజపా ప్రతిపాదన ఆసక్తిగా మారింది.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని