Family Star: విజయ్‌ ‘ఫ్యామిలీ స్టార్‌’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

విజయ్‌ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Updated : 26 Apr 2024 08:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star) ఓటీటీలోకి వచ్చేసింది. ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’ (Amazon Prime Video)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగు, తమిళ్‌ ఆడియోతో అందుబాటులో ఉంది. ఏప్రిల్‌ 26న ఈ చిత్రం ఓటీటీలోకి రానుందంటూ ప్రచారం జోరుగా సాగినా సదరు సంస్థ స్పందించలేదు. ఎలాంటి ప్రకటన లేకుండా యూజర్లకు తాజాగా సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. ‘గీత గోవిందం’ తర్వాత హీరో విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda)- డైరెక్టర్‌ పరశురామ్‌ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ఇది. మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) హీరోయిన్‌. హిట్‌ కాంబోలో తెరకెక్కడంతో భారీ అంచనాల నడుమ ఈ నెల 5న థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే.

ఈ సినిమా కథేంటంటే?.. గోవ‌ర్దన్‌ (విజ‌య్ దేవ‌ర‌కొండ‌) మ‌ధ్యత‌ర‌గ‌తి యువ‌కుడు. కుటుంబం అంటే ప్రాణం. సివిల్ ఇంజినీర్‌గా ఎక్కువ సంపాదించే అవ‌కాశం ఉన్నా కుటుంబానికి దూరంగా వెళ్లడం ఇష్టం లేక హైద‌రాబాద్‌లోనే ప‌నిచేస్తుంటాడు. మ‌ద్యానికి బానిసైన పెద్దన్నయ్య, ఇంకా జీవితంలో స్థిర‌ప‌డే ద‌శ‌లోనే ఉన్న చిన్నన్నయ్య. వాళ్ల కుటుంబాల మంచీ చెడుల్ని చూస్తూ చాలీ చాల‌ని జీతంతో నెట్టుకొస్తున్న అతడి జీవితంలోకి ఇందు (మృణాల్ ఠాకూర్‌) వ‌స్తుంది. వ‌చ్చీ రాగానే అత‌ని కుటుంబాన్నీ అర్థం చేసుకుని వాళ్లతో క‌లిసిపోతుంది. ఇద్దరూ ప్రేమ‌లో ప‌డతారు. ఇంత‌లో ఊహించ‌ని విధంగా ఇందు రాసిన ఓ పుస్తకం గోవ‌ర్దన్‌ చేతికందుతుంది. ఆ పుస్తకంలో ఏం ఉంది? అది ఆ ఇద్దరి మ‌ధ్య ప్రేమ‌ని ఎలా ప్రభావితం చేసింది?అస‌లు ఇందు ఎవ‌రు? గోవర్ధన్‌ జీవితంలోకి ఎలా వ‌చ్చింది? అత‌డు మిడిల్‌క్లాస్‌ ఫ్యామిలీ క‌ష్టాల నుంచి గట్టెక్కాడా లేదా?త‌దిత‌ర విష‌యాల్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని