పుట్టినరోజు పులిప్రేమ

తోటిస్టార్లను పోగేయడం.. భారీగా పార్టీ విందు వినోదాల్లో తేలిపోవడం సినీ జీవుల పుట్టినరోజు వేడుకలు దాదాపు ఇలాగే ఉంటాయి....

Published : 04 Jun 2016 01:26 IST

పుట్టినరోజు పులిప్రేమ

తోటిస్టార్లను పోగేయడం.. భారీగా పార్టీ విందు వినోదాల్లో తేలిపోవడం సినీ జీవుల పుట్టినరోజు వేడుకలు దాదాపు ఇలాగే ఉంటాయి. అరుదుగా సేవా కార్యక్రమాలు చేపట్టే తారలూ లేకపోలేదు. కానీ వీరందరికంటే భిన్నంగా తన పుట్టినరోజు నిర్వహించింది మన తెలుగు మూలాలున్న అదితీరావు హైదరీ. రాచవంశంలో పుట్టిన ఈ భామకు మొదట్నుంచీ పులులంటే తెగ ఇష్టం. తగ్గుముఖం పడుతున్న ఈ జాతిని కాపాడే చర్యల్లో చురుకుగా పాల్గొంటుంది. ఈ పుట్టినరోజుకు మాత్రం ‘సేవ్‌ టైగర్స్‌ ప్రాజెక్టు’ ప్రచారంలో భాగస్వామి కావాలని నిర్ణయించుకుంది. ఓ టీవీ ఛానల్‌ చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం ఏకంగా సుందర్‌బన్‌ అడవుల్లోకి వెళ్లింది. సమీప గ్రామాల్లో పర్యటించి ప్రచారం చేసింది. సరస్సులో బోటు ప్రయాణం చేసింది. కాలినడకన కిలోమీటర్లు కలియతిరిగింది. ‘అసలే సుకుమారి మీరు ఇన్ని వ్యయప్రయాసలు పడటం అవసరమా?’ అని కొందరు అడిగితే మృగరాజుపై నాకున్న ప్రేమ ముందు ఈ కష్టం ఏపాటిది? అని గడసరిగా సమాధానం చెప్పింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని