Election Commission: పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు

పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది.

Updated : 27 Apr 2024 10:11 IST

అమరావతి: పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ అమలు దృష్ట్యా లబ్ధిదారులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరింది. పింఛన్‌ సహా నగదు బదిలీ పథకాలకు అనుసరించాల్సిన మార్గదర్శకాలను మార్చి 30న జారీ చేసినట్లు వెల్లడించింది. ఆ మార్గదర్శకాలను వాస్తవిక దృష్టితో ఆలోచించి అమలు చేయాలని సీఎస్‌ జవహర్‌రెడ్డికి తేల్చిచెప్పింది. పంపిణీకి శాశ్వత ఉద్యోగులను వినియోగించుకోవాలని స్పష్టం చేసింది. పింఛన్ల ఇంటింటి పంపిణీకి వాలంటీర్లకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవాలని ఈసీ ఆదేశించింది.

పింఛన్ల అందజేతలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై చాలా ఫిర్యాదులు వచ్చాయని ఈసీ పేర్కొంది. లబ్ధిదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురైనట్లుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపింది. ఎలక్ట్రానిక్ విధానాల ద్వారా పంపిణీతో పాటు ఉద్యోగుల ద్వారా అందజేయవచ్చని గత మార్గదర్శకాల్లో చెప్పినట్లు వెల్లడించింది. లబ్ధిదారులకు అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీఎస్ జవహర్‌రెడ్డికి సూచించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని