పోజు పెట్టు.. ఫొటో పంపు

మండే వేసవి తర్వాత వచ్చే చిటపట చినుకుల వాన అంటే ఎవరికైనా ఇష్టమే. ఆ వర్షపు జల్లుల్లోనే ఒళ్లంత తుళ్లిపడేలా కొందరు డాన్స్‌ చేస్తారు.

Published : 18 Jun 2016 01:23 IST

పోజు పెట్టు.. ఫొటో పంపు

మండే వేసవి తర్వాత వచ్చే చిటపట చినుకుల వాన అంటే ఎవరికైనా ఇష్టమే. ఆ వర్షపు జల్లుల్లోనే ఒళ్లంత తుళ్లిపడేలా కొందరు డాన్స్‌ చేస్తారు. కిటికీ పక్కన కూర్చొని ఆ దృశ్యాన్ని ఆస్వాదిస్తూ ఇంకొందరు కాఫీనో, టీనో సిప్‌ చేస్తుంటారు. పిల్లల్లా మారి పేపరు పడవలు చేసి పిల్ల కాలువల్లో వదిలేది మరింతమంది. ఎవరిష్టం వారిది. అయితే మెగా పిక్సళ్ల కెమేరాలు చేతికొచ్చాక ఈ చేష్టలన్నీ చిత్రాలుగా ఒదిగిపోతున్నాయి. ఆ అపురూపమైన ఫొటోలను మాకు పంపండి. బాగున్నవాటిని ప్రచురిస్తాం అంటోంది రెడిఫ్‌ డాట్‌కామ్‌. మీ సంతోషాన్ని దేశం మొత్తం పంచుకునే అవకాశం ఇది. ఇంకెందుకాలస్యం? మీ వానాకాలం మధుర స్మృతులను getahead@rediff.co.in కు పంపండి మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని