పాప్స్‌తో జాగ్రత్త

పుట్టిన రోజు, పెళ్లి, పార్టీ... వేడుకేదైనా యువత హంగామా మామూలుగా ఉండదు. కేక్‌ కట్‌ చేస్తుంటే పాప్స్‌(పాపర్స్‌) పేలుస్తారు. తాళి కడుతుంటే పాప్స్‌ పేల్చి సంబరాలు రెట్టింపు చేస్తారు. బ్యాచిలర్‌ పార్టీ అంటే ఇక చెప్పక్కర్లేదు....

Published : 05 May 2018 01:15 IST

పాప్స్‌తో జాగ్రత్త

పుట్టిన రోజు, పెళ్లి, పార్టీ... వేడుకేదైనా యువత హంగామా మామూలుగా ఉండదు. కేక్‌ కట్‌ చేస్తుంటే పాప్స్‌(పాపర్స్‌) పేలుస్తారు. తాళి కడుతుంటే పాప్స్‌ పేల్చి సంబరాలు రెట్టింపు చేస్తారు. బ్యాచిలర్‌ పార్టీ అంటే ఇక చెప్పక్కర్లేదు. చిన్న శబ్దంతో పేలి... అవి రంగు కాగితాలు, మెరుపులను చల్లుతుంటే కేకలతో ఉర్రూతలూగుతారు. ఇలా అన్ని ఫంక్షన్లలో పాప్స్‌ పేల్చడం సర్వసాధారణమైంది. అయితే వీటి వల్ల చాలా మందికి ఇబ్బందులు తప్పడం లేదు. ఇవి పేల్చేటప్పుడు కళ్లు ఎక్కువగా దెబ్బతింటున్నాయి. ఎందుకిలా జరుగుతోందని పరిశీలిస్తే... పాప్స్‌ తయారీలో రెడ్‌ పాస్పరస్‌, పొటాషియం క్లోరైట్‌, పొటాషియం పర్‌క్లోరైట్‌, సల్ఫర్‌ వంటివి వాడుతున్నట్లు తేలింది. పాప్స్‌ పేలడం కోసం వీటిని గ్రాములో వెయ్యోవంతు పరిమాణంలో వాడుతున్నారని తెలిసింది. ఫ్రెండ్స్‌ జాగ్రత్త మరీ!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని