logo

ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!

వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్‌ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది.

Updated : 27 Apr 2024 07:34 IST

వాహనమిత్ర’ పేరుతో జగనన్న మాయ
ఆ చేత్తో ఇస్తూ...ఈ చేత్తో పన్నుల వాత!
ఇష్టానుసార జరిమానాలతో ఆటో డ్రైవర్ల కుదేలు

వైకాపా ప్రభుత్వం వచ్చింది.. ఆటో డ్రైవర్లను జగన్‌ ఆదుకుంటాడని అంతా ఊహించారు. రూ.పది వేల సాయం చేశాడని సంబరపడిపోయారు. ఆటోల మీద పన్నుల బాదుడు మొదలైన తరువాత కొద్ది రోజులకే పరిస్థితి వారికి అర్థమైంది. రూ.పదివేలు వద్దు మమ్మల్ని బతకనివ్వండంటూ వేడుకోని ఆటో డ్రైవర్‌ లేరంటే ఆశ్చర్యపోనవసరం లేదు.

ఈనాడు, విశాఖపట్నం

తంలోరోజంతా ఆటో నడిపి ఇంటిలో కొంత డబ్బులు ఇచ్చి.. మిగిలినదాంతో రుణం తీర్చేవారు. ఇప్పుడు పన్నుల భారం భరించలేక ఇంట్లో ఇవ్వడానికి డబ్బులు చాలక నానా అగచాట్లు పడుతున్నారు. జగన్‌ పాలనలో పది రూపాయలు ఇచ్చి రూ.వంద పిండేశారు. జిల్లాలో 50 వేలకుపైగా ఆటోలు ఉంటే సగం మందికి పైగా డ్రైవర్లు అప్పులపాలయ్యారు.

  • ఆటో డ్రైవర్లకు అయిదేళ్లలో రూ.50 వేల చొప్పున సాయం చేసిన వైకాపా ప్రభుత్వం పన్నులు, జరిమానాల రూపంలో ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష పైచిలుకు లాగేసిందంటే ఆశ్చర్యపోక తప్పదు. గాజువాకలో ఓ లబ్ధిదారుడు    అయిదేళ్లలో రూ.50 వేల సాయం అందుకుంటే పన్నులు, వివిధ రకాల జరిమానాలు మొత్తం రూ.లక్ష పైగా చెల్లించి చితికిపోయాడు.
  • ఆటో డ్రైవర్లను ఆదుకుంటున్నట్లు చెబుతున్న వైకాపా ప్రభుత్వం లబ్ధిదారుల సంఖ్యలో  కోత పెట్టింది. అద్దె ఆటోలు నడిపే వారికి సాయం మంజూరు చేయలేదు. యజమానులైనా.. చిన్నపాటి పత్రాలు సమర్పించకపోయినా కోత విధించేశారు. జిల్లాలో ఆటోలు దాదాపు 55,446 ఉన్నాయి. మొదటి ఏడాదిలో 32,778 మందికి వాహనమిత్ర కింద రూ.10 వేల చొప్పున అందజేయగా.. తర్వాత ఏడాది అదనంగా 5,223 మందికి అందజేసి ఆ తర్వాత మూడేళ్లు భారీగా కోత పెట్టారు. 2022-23 నాటికి ఈ కోత సంఖ్య 17 వేలకు చేరింది. 2023-24లో దాదాపు 1400 మందిని కొత్తగా జాబితాలో చేర్చి ఏదో ఉద్ధరించినట్లు ప్రచారం చేసుకున్నారు.

ఇలా కుదేలు: గత తెదేపా హయాంలో జరిమానాలు చాలా తక్కువ. వైకాపా వచ్చాక ఆ రకమైన కేసులు భారీగా పెరిగాయి. గతంలో నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.130 జరిమానా ఉండేది. ఇప్పుడు దాన్ని ఏకంగా రూ.1,000కి పెంచారు. చిన్నచిన్న వాటికి అపరాధ రుసుములు చెల్లించాలని రవాణాశాఖ, పోలీసుల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. నో పార్కింగు అని, పరిమితికి మించి ఎక్కించుకున్నారని, నెంబరు ప్లేటు సరిగా లేదని, కాలుష్య ధ్రువీకరణ ఇతర కారణాలను అడ్డం పెట్టుకొని ముక్కు పిండి మరీ వసూలు చేశారు. రోడ్డు మీద ప్రయాణిస్తున్న ఆటోలను ఆపి మరీ పెండింగు చలాన్లను తనిఖీ చేసి కట్టించుకున్నారు. డబ్బులు లేవు మళ్లీ చెల్లిస్తామన్నా కరుణ చూపలేదు. ఏదైనా కారణంతో రహదారి మధ్యలో ఆపితే చాలు బాదుడే బాదుడు.  జగన్‌ సర్కారు విధించిన పన్నుల భారం భరించలేక చాలా మంది విసిగిపోయారు.

జిల్లాలోని ఆటోలు: 55,446

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని