logo

రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!

జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు.

Updated : 27 Apr 2024 07:55 IST

ఇంధన ధరలపై స్థానికుల మండిపాటు

తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా కొత్తూరు పెట్రోలు బంకులో ఇలా..

 కుప్పం మండలం మల్లానూరు బంకులో..

కుప్పం గ్రామీణ, న్యూస్‌టుడే: జగనన్న ఎడాపెడా బాదుతూ అందిన కాడికి దండుకుంటున్నారు. నిత్యావసరాలు, మద్యంతో పాటు ఇంధన ధరల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కుప్పం మండలం మల్లానూరులో రాష్ట్రంలోనే అత్యధికంగా లీటరు పెట్రోల్‌ ధర రూ.112.02 ఉంది. ఈ గ్రామానికి  రెండు కిలోమీటర్ల దూరంలోని తమిళనాడు రాష్ట్రం తిరుపత్తూరు జిల్లా కొత్తూరు పెట్రోలు బంకులో లీటరు రూ.102.80కే లభిస్తోంది. రెండు కిలోమీటర్లకే లీటరు ధరలో రూ.9.22 వ్యత్యాసం ఉండటంతో వాహనదారులు అక్కడికి వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. కుప్పానికి కూతవేటు దూరంలోని కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా కెంపాపుర పెట్రోల్‌ బంకులో లీటరు రూ.100.02కే లభిస్తోంది. పొరుగు రాష్ట్రాల్లో పెట్రోలు చౌకగా లభిస్తున్నా.. రాష్ట్రంలో పెట్రో బాదుడు వేసి భారాన్ని మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు