GATE 2024: గేట్‌-2024లో కొత్తగా డేటా సైన్స్‌ అండ్‌ ఏఐ ప్రశ్నపత్రం

ఐఐటీలు తదితర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌-2024)లో ఈసారి కొత్తగా డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు.

Updated : 06 Aug 2023 09:01 IST

24 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం!
ఫిబ్రవరి 3 నుంచి 11 వరకు పరీక్షలు

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీలు తదితర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌-2024)లో ఈసారి కొత్తగా డేటా సైన్స్‌ అండ్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌(డీఏ) ప్రశ్నపత్రాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటివరకు మొత్తం 29 ప్రశ్నపత్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. ఈసారి గేట్‌ను బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్‌సీ) నిర్వహించనుంది. ఈ నెల 24వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. పరీక్షలను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 200 నగరాలు, పట్టణాల్లో పరీక్ష జరుగుతుంది. గేట్‌లో సాధించిన స్కోర్‌ను బట్టి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తాయి.

పరీక్షలు జరిగే ప్రాంతాలు

తెలంగాణలో: హైదరాబాద్‌, మెదక్‌, నల్గొండ, ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, నిజామాబాద్‌, సూర్యాపేట, వరంగల్‌

ఏపీలో: చీరాల, చిత్తూరు, గూడూరు, గుంటూరు, కడప, నెల్లూరు, ఒంగోలు, తిరుపతి, ఏలూరు, కాకినాడ, సూరంపాలెం, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, అనంతపురం, కర్నూలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని