పులివెందుల పక్క నుంచే కొడికొండ-మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్‌వే

కొత్తగా నిర్మించ తలపెట్టిన కొడికొండ-మేదరమెట్ల డెడికేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే.. సీఎం సొంత నియోజకవర్గ కేంద్రమైన పులివెందులకు సమీపం నుంచి వెళ్లేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక

Updated : 19 Feb 2022 06:47 IST

రూ.17 వేల కోట్ల అంచనాతో డీపీఆర్‌ సిద్ధం

ఈనాడు, అమరావతి: కొత్తగా నిర్మించ తలపెట్టిన కొడికొండ-మేదరమెట్ల డెడికేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే.. సీఎం సొంత నియోజకవర్గ కేంద్రమైన పులివెందులకు సమీపం నుంచి వెళ్లేలా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధమైంది. మరోవైపు అధికారులు మార్కింగ్‌ పనులు కూడా మొదలు పెట్టారు. 332 కి.మీ.మేర నాలుగు వరసలతో దీని నిర్మాణానికి భూసేకరణతో కలిపి రూ.17 వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఏపీ-కర్ణాటక సరిహద్దులోని అనంతపురం జిల్లా కొడికొండ వద్ద బెంగళూరు-హైదరాబాద్‌ జాతీయ రహదారి-44 వద్ద ఈ ఎక్స్‌ప్రెస్‌వే మొదలవుతుంది. అక్కడి నుంచి పులివెందులకు 10 కి.మీ. దూరం నుంచి వెళ్తూ.. వీరపునాయనపల్లి మండలం అనివేల, ఎర్రగుంట్ల-కమలాపురం మధ్య నుంచి మైదుకూరు మీదుగా బ్రహ్మంగారి మఠం మండలం మల్లేపల్లి, ప్రకాశం జిల్లా కనిగిరి, చీమకుర్తి మీదుగా మేదరమెట్ల-మార్టూరుకు మధ్య చెన్నై-కోల్‌కతా జాతీయ రహదారి-16లో కలవనుంది.

ఈ అలైన్‌మెంట్‌తోనే డీపీఆర్‌ తయారు చేశారు. ఈ రహదారి కోసం 8 వేల ఎకరాలు అవసరమవుతాయని గుర్తించారు. ఇందులో ప్రభుత్వ, అటవీ, పట్టా భూముల వారీగా వివరాలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే డీపీఆర్‌ ప్రకారం ఏయే గ్రామాల మీదుగా ఈ రోడ్డు వెళ్తుందనే వివరాలతో నోటిఫికేషన్‌ ఇవ్వగా, వచ్చేవారం ఆయా గ్రామాల వారీగా సర్వే నంబర్లతో 3-ఎ నోటిఫికేషన్‌ విడుదల చేస్తారు.

బైక్‌లు, ఆటోలకు అనుమతి ఉండదు..: ఈ ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం 332 కి.మీ. ఉండగా, వాహనదారులు అన్నిచోట్లా ఈ రహదారిపైకి వెళ్లేందుకు అవకాశం ఉండదు. 13 చోట్ల మాత్రమే రహదారిపైకి ప్రవేశించేందుకు, బయటకు వచ్చేందుకు (ఎగ్జిట్‌)కు అవకాశం ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని