Engineering Counselling: ఏపీలో ఇంజినీరింగ్‌లో మూడో విడత కౌన్సెలింగ్‌ ఎత్తివేత

ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి ఇప్పటి వరకు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుండగా ఈ ఏడాది రెండింటితోనే ప్రభుత్వం సరిపెట్టింది.

Updated : 04 Oct 2023 07:24 IST

ఈనాడు, అమరావతి: ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి ఇప్పటి వరకు ఏటా మూడు విడతల కౌన్సెలింగ్‌(Engineering Counselling) నిర్వహిస్తుండగా ఈ ఏడాది రెండింటితోనే ప్రభుత్వం సరిపెట్టింది. మూడో విడత కౌన్సెలింగ్‌ ఉంటుందని కొందరు విద్యార్థులు ఇప్పటి వరకు ఎదురు చూసినా తాజాగా ఉన్నత విద్యామండలి నేరుగా స్పాట్‌కు నోటిఫికేషన్‌ ఇచ్చింది. స్పాట్‌ కింద ప్రవేశాలు పొందే విద్యార్థులకు బోధన రుసుముల చెల్లింపు ఉండదు. అదే మూడో విడత కౌన్సెలింగ్‌ ద్వారా చేరితే ప్రభుత్వమే బోధన రుసుములను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో కొందరు విద్యార్థులు ఆందోళనతో మంగళవారం ఉన్నత విద్యామండలి కార్యాలయానికి చేరుకుని ప్రత్యేక కౌన్సెలింగ్‌ చేపట్టాలని కోరారు. ఫీజుల డబ్బులను మిగుల్చుకునేందుకు ఒక విడత కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం ఎత్తివేసిందని వారు విమర్శిస్తున్నారు. వెంటనే మూడో విడత కౌన్సెలింగ్‌ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే స్పాట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చినందున చాలా కళాశాలలు సీట్లను భర్తీ చేసుకుంటున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని